కమల్‘విశ్వరూపం’టైటిల్‌పై వివాదం
కమల్ హాసన్ తాజా చిత్రం 'విశ్వరూపం'ఇప్పుడు టైటిల్ విషయంలో చిత్రమైన వివాదం ఎదుర్కొంటోంది. ఈ చిత్రం టైటిల్ సంస్కృతంలో ఉంది కాబట్టి దాన్ని తమిళంలోకి మార్చాలి అని తమిళనాడుకు చెందిన 'హిందూ మక్కళ్ కట్చి'డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేసారు. గతంలోనూ కమల్ హాసన్ చిత్రం మన్మధ బాణం చిత్రం విడుదల సమయంలోనూ ఆ చిత్రం పాట విషయంలో వివాదం ఈ 'హిందూ మక్కళ్ కట్చి'వారు లేవనెత్తిన సంగతి తెలిసిందే.
ఇక 'హిందూ మక్కళ్ కట్చి'వారు అనేదేమిటంటే...''కమల్‌హాసన్ ఎన్నో తమిళ చిత్రాల్లో నటించారు. ఆయన నివాసం కూడా తమిళనాడే. అలాంటప్పుడు తన సినిమాకు అసలు సిసలు తమిళ భాషలో టైటిల్ ఎందుకు పెట్టరు. ఒక గొప్ప నటుడిగా ఆయన ఎంతోమందికి రోల్‌మోడల్‌గా నిలుస్తారు. అలాంటాయన స్వచ్ఛమైన తమిళ భాషలో టైటిల్ పెట్టి పలువురికి ఆదర్శంగా నిలవాలి''అన్నారు.'విశ్వరూపం' అనేది సంస్కృత పదం కాబట్టి, తమిళ భాషలో టైటిల్ పెడితే బాగుంటుందని హెఎమ్‌కె కన్నన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ విన్నపాన్ని కమల్ అర్థం చేసుకుని టైటిల్ మార్చుతారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
ఇక ఈ విషయమై కమల్ ఏమీ మాట్లాడలేదు. కమల్‌హాసన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాకుమార్, ఆండ్రియా నాయికలుగా నటించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల 'ఐఫా' వేడుకల్లో ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. అలాగే కాన్స్ చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన 'విశ్వరూపం'ని తెలుగులో అనువదించి విడుదల చేయనున్నారు.
ఈ చిత్రం గురించి కమల్‌హాసన్ మాట్లాడుతూ ''నా కెరీర్‌లోనే భారీ వ్యయంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇదేదో సూపర్ హీరో సినిమా కాదు. జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన కథాంశమిది. ఈ సినిమాకి కొనసాగింపుగా 'విశ్వరూపం 2' కూడా రూపొందిస్తాను. ఇందుకు సంబంధించిన ఆలోచనలు నా మదిలో ఉన్నాయి. త్వరలోనే వాటికి రూపం ఇవ్వాలనుకొంటున్నాను. 'విశ్వరూపం' కథకు కొనసాగింపు తీయదగ్గ లక్షణాలున్నాయి. ఇప్పటికే సీక్వెల్ తీశాననీ, మొదటి భాగంలో ఎక్కువ తీశాననీ వార్తలొస్తున్నాయి. అవి సత్యదూరం'' అన్నారు.


Click it and Unblock the Notifications











