షకీలా పై కేసు...వార్నింగ్!!

షకీలాలాంటి అసభ్యంగా నటించే తార పవిత్రమైన బుర్ఖాని ధరించటమా అని తమిళనాడు ముస్లిమ్ మున్నేటకజం సంస్ద(TMMK) కోపంతో ధ్వజమెత్తింది. మరో మారు బుర్ఖా ధరిస్తే ఊరుకునేది వీలులేదని వారు ఆమెని ఆదేశించారు.అయితే షకీలా దీన్ని వ్యతిరేకిస్తోంది. ఆమె లోకల్ మీడియాతో మాట్లాడుతూ నేను ముస్లింని...ఆ మతానికి సంభందించిన నేను బుర్కా ధరించే హక్కునూ కలిగిఉన్నాను. ఎవరేమన్నా,ఏం చేసినా సరే నేను బుర్ఖా ధరించేది మానేది లేదు. ఇది నా నిర్ణయం. దీనిపై వచ్చే ఎటువంటి పరిణామాలకైనా ఎదుర్కోవటానికి నేను సిద్ధమేనని ప్రకటించింది.చివరకు ఈ వివాదం ఎక్కడకి దారితీస్తుందోనని రాజీచేయటానికి కొందరు ఆమె శ్రేయాభిలాషులు ప్రయత్నిస్తున్నారని వినికిడి.


Click it and Unblock the Notifications











