మురుగదాస్‌కు కొత్త చిక్కులు.. ఆ పని చేసేవరకు వదిలిపెట్టం, వెంటాడుతున్న సర్కార్!

Recommended Video

TN Govt Demands Written Apology From AR Murugadoss

ఇళయదళపతి విజయ్, ప్రతిభగల దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ చిత్రం ఘనవిజయం సాధించింది. వీరిద్దరి కాబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఓటు హక్కు దుర్వినియోగం, సెక్షన్ 49పి, రాజకీయాల్లో జరుగుతున్న కుట్రలు లాంటి ఆసక్తికర అంశాలతో మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కమర్షియల్ అంశాలతో పాటు మురుగదాస్ చెప్పాలనుకున్న సందేశం కూడా ప్రేక్షకులకు నచ్చింది. ఫలితంగా సర్కార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అదే స్థాయిలో ఈ చిత్రాన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి.

250 కోట్లకుపైగా

250 కోట్లకుపైగా

సర్కార్ చిత్ర జైత్ర యాత్ర ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్ రాబట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించింది. ప్రముఖ నటుడు రాధారవి కీలక పాత్రలో నటించారు. తమిళనాడు ప్రభత్వ పథకాలపై తీసిన సన్నివేశాలు, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్టని దిగజార్చేలా ఉన్న సన్నివేశాల విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

 థియేటర్స్‌పై దాడి

థియేటర్స్‌పై దాడి

అన్నా డీఎంకే పార్టీ మంత్రులే సర్కార్ చిత్రానికి హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. ఆ పార్టీ కార్యకర్తలు సర్కార్ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్స్ పై దాడులకు తెగబడ్డారు. ఓ దశలో మురుగదాస్ ని అరెస్ట్ చేస్తారనే ఉహాగానాలు సైతం వినిపించాయి. వివాదం తీవ్రమవుతున్న సమయంలో చిత్ర యూనిట్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గింది. వివాదభరిత సన్నివేశాలని తొలగించారు.

 అయినా వదిలిపెట్టం

అయినా వదిలిపెట్టం


వివాద భరిత సన్నివేశాల్ని తొలగించడంతో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ మరోమారు తమిళనాడు ప్రభుత్వం దర్శకుడు మురుగదాసుని టార్కెట్ చేసింది. ప్రభుత్వంలోని పెద్దలు మురుగదాస్ చేత బహిరంగ క్షమాపణ చెప్పించాలని పట్టుబడుతున్నారట. దీనికోసం ప్రభుత్వం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 భవిష్యత్తులో ఇలాంటి విమర్శలు

భవిష్యత్తులో ఇలాంటి విమర్శలు


భవిష్యత్తులో మురుగదాస్ తన చిత్రాల్లో ప్రభుత్వం విమర్శలు చేయనని తెలుపుతూ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. దీనిపై మురుగదాస్ లాయర్ స్పందించారు. మురుగదాస్ తో చర్చించిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు. విజయ్ నటించిన మెర్సల్ చిత్రం కూడా ఇదేవిధంగా తీవ్ర వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X