నయన్ పెళ్లికి రజనీకాంత్, షారుఖ్… ఒక్కరూ కనిపించని టాలీవుడ్ స్టార్స్.. అందుకే వెళ్లలేదా?
దక్షిణాదిలోనే లేడీ సూపర్ స్టార్ స్థాయి అందుకున్న నయనతార గతంలో ఇద్ద తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.. కొంతకాలం పాటు హీరో శింబుతో డేటింగ్ చేసిన నయనతార ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయింది. తరువాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమలో పడి వివాహం దరిదాపుల్లో దాకా వెళ్లి ఆ తర్వాత చివరి క్షణాల్లో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ వివాహం కూడా పెళ్లి పీటలు వరకు వెళ్లలేదు. గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విగ్నేష్ శివన్- నయనతార దంపతులు వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహానికి తెలుగు నుంచి పెద్దగా ఎవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

రెండు పద్దతుల్లో
దర్శకుడు విఘ్నేష్ శివన్ నయనతార చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం జూన్ 9న వీరు ఏడడుగులతో అధికారికంగా భార్యాభర్తలుగా మారిపోయారు. ఉదయం ఎనిమిది గంటల పదినిమిషాల నుంచి వీరి వివాహ తంతు మొదలైనట్లు సమాచారం. విగ్నేష్ హిందూ, నయనతార క్రిస్టియన్ కావడంతో ఆ రెండు సంప్రదాయ పద్దతుల్లో వివాహం జరిగినట్లు వార్తలు వనస్తున్నాయి.

స్పెషల్ అట్రాక్షన్‌గా
ఇక నయనతార, విఘ్నేష్‌శివన్ పెళ్లి వేడుకకు కోలీవుడ్ సినీ ప్రముఖులందరూ హాజరయినట్టు భోగట్టా. నయన్, విఘ్నేష్ పెళ్లికి బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్‌ఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారని అంటున్నారు. ప్రస్తుతము తాను సినిమా చేస్తున్న దర్శకుడు అట్లీ దంపతులతో కలిసి షారుఖ్‌ఖాన్ పెళ్లికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే అట్లీ ఫ్యామిలీతో షారుఖ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షారుఖ్‌ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్‌కు అట్లీ దర్శకత్వం వహిస్తుండగా ఆ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

రజనీకాంత్ కూడా
ఇక మరోపక్క కోలీవుడ్ అగ్ర హీరో రజనీకాంత్ కూడా నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో రజనీకాంత్ కనిపించిన ఫొటోలు సైతం వెనువెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రజనీకాంత్ మాత్రమే కాక కార్తి, విజయ్ సేతుపతి, ఎస్జే సూర్య, మణిరత్నం, కెఎస్ రవికుమార్, స్టాలిన్ కుమారుడు ఉధయనిధి స్టాలిన్ తో పాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు పెళ్లి వేడుకలో దర్శనమిచ్చారు.

తెలుగు స్టార్స్ మిస్సింగ్
అయితే అంతా బాగానే ఉంద్ కానీ నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్స్ ఎవరూ కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. నిజానికి చిరంజీవి, బాలకృష్ణ, , నాగార్జున, వెంకటేష్‌తో పాటు తెలుగులో పలువురు అగ్ర హీరోలంతో సినిమాలు చేసింది నయనతార. టాలీవుడ్‌లో ఆమెకు మంచి ప్రోత్సాహం కూడా ఉంది. అలాంటిది ఆమె పెళ్లిలో తెలుగు సినీ ప్రముఖులు ఒక్కరు కూడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆహ్వానించే యోచనలో
దానికి కారణం టాలీవుడ్ నుంచి చాలా తక్కువ మందికి ఆహ్వానాలు అందాయని, ఆ ఆహ్వానం కూడా ఫోన్ ద్వారానే కావడంతో ఎవరూ వెళ్లేందుకు ఆసక్తి చూపలేదని అంటున్నారు. మొక్కుబడిగా పిలిచారని భావించి తెలుగు వారెవరూ పెళ్ళికి వెళ్లలేదని అంటున్నారు. ఇక త్వరలో చెన్నైలో రిసెప్షన్ జరిపేందుకు నయనతార, విఘ్నేష్ శివన్ ప్లాన్ చేస్తున్న క్రమంలో ఈ వేడుకకు మాత్రం అందరినీ ఆహ్వానించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











