ప్రపంచ వ్యాప్తంగా పాకిన వెర్రి పాటను పాడి టాప్ సింగర్ 4ఏళ్ళ కొడుకు...!
ధనుష్ హీరోగా అతని భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించిన తమిళ చిత్రం '3"లో ఉన్న 'కొలవెరి కొలవెరి డీ.." పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. చిన్నోళ్ల నుంచి పెద్దోళ్లో వరకు అందరూ ఈ పాటను ఇష్టపడి వింటున్నారు..పాడుతున్నారు. గాయకుడు సోనూ నిగమ్ కొడుకు నేవాన్ నిగమ్ కూడా ఈ పాటను అనుకరించి, తనదైన శైలిలో పాడుతున్నాడు. ఈ బుడతడికి నాలుగేళ్లు. ఈ పాటను ఇష్టంగా పాడేస్తున్నాడట. వెర్రి పాట పిల్లలకు కూడా ఎంత నచ్చిందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.
వెర్రివేయి విధాలని వెనకటికి ఎవరో ఓ పెద్దాయన సరదాగా అన్నాడు. అది సరదాగా కాదు నిజంగానే అన్నాడని చాలా సందర్బాల్లో చాలా వెర్రి వేషాల్ని చూసి చాలా మంది అనుకున్నారు. అలాంటి 'వెర్రి" ఇప్పుడు కోట్లు దాటేస్తోంది. కోలవెరి డీ పాట గురించి '3"అనే తమిళ సినిమా కోసం ధనుష్ సరదాగా పాడిన 'కొలవెరి డీ" పాట ఇంటర్నెట్ లో గత కొద్ది రోజులుగా హాల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.
బ్రోకెన్ ఇంగ్లీష్..అంటూ పచ్చి ఇంగ్లీషు పదాల్ని వాడి రూపొందించిన ఈ పాటకి ప్రాంతీయ బేధం లేకుండా పోయింది. ఖండాంతరాలు దాటేసింది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. స్వైన్ ప్లూ లా ప్రపంచ వ్యాప్తంగా ఈ వెర్రి పాట పాకిపోయింది. తొలుత పదివేలు...ఆ తర్వాత పది లక్షలు..మొన్నీమధ్యనే కోటి...ఇప్పుడేమో పది కోట్ల దిశగా దూసుకుపోతోందనే వార్తలు..ఇవన్నీ ఇంటర్నెట్ లో 'కోలవెరి డీ " పాటకి పడ్డ హిట్స్ అట. ముందు ముందు ఈ పాట ఇంకెన్ని రికార్డులు సృషిస్తుందోగానీ, ప్రస్తుతానికైతే ప్రపంచ వ్యాప్తంగా ఇంత పాపులర్ అయిన పాట ఇంకోటి లేదనే ప్రచారం మాత్రం జరుగుతోంది సర్వత్రా...


Click it and Unblock the Notifications











