స్టార్ హీరోల కూతులిద్దరూ కలిసి మొదలెట్టారు
స్టార్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ కూతుళ్ళైన శృతిహాసన్, ఐశ్వర్య కలసి పనిచేయటం మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్ లో ధనుష్ హీరోగా ఓ చిత్రం మొదలై రీసెంట్ గా షూటింగ్ జరుపుకుంది. ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమయ్యే ఈ చిత్రం ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక శృతి,ఐశ్వర్యా ఇద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ప్రెండ్స్. ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తూ చేసిన అనగనగా ఒక ధీరుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.ప్రస్తుతం శృతిహాసన్ తెలుగులో ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలోనూ, సిద్దార్ధ సరసన ఓ మై ప్రెండ్ లోనూ, అలాగే గబ్బర్ సింగ్ లో పవన్ సరసన చేస్తోంది.
అయితే ఆమెకు స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ మాత్రం వస్తున్నాయి. ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాననే ఆమె తమిళంలో సూర్య సరసన 'సెవెంత్ సెన్స్ ' అనే చిత్రంలో మురగుదాస్ దర్శకత్వంలో చేస్తోంది. సర్కస్ నేపధ్యంలో కథ జరగనుంది.. రెడ్ జెయింట్ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు.ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











