నన్ను దెబ్బ తీయాలనే..నమిత

By Srikanya

నమిత తాజాగా తనపై కుట్ర జరుగుతోందంటూ వాపోతోంది. తన లేటెస్ట్ ఫిల్మ్ జగన్మోహిని ఈ నెల పదిహేడున రిలీజ్ అవుతున్న సమయంలో తన పాత ఫ్లాఫ్ సినిమాలను కావాలని రిలీజ్ చేస్తున్నారని చెప్తోంది.తెలుగులో నాలుగేళ్ళ క్రితం రిలీజైన నాయకుడుని డబ్ చేసి తమిళనాడులో రిలీజ్ చేయటం అందులో భాగమేనంటోంది. ఆ విషయమై మాట్లాడుతూ..ఆ తెలుగు వెర్షన్ వచ్చి నాలుగేళ్ళు అవుతోంది.అప్పట్లో ఆ చిత్రం కేవలం రాజశేఖర్ అభిమానులను అలరించటానికి తీసింది. ముఖ్యంగా నా పాత్ర పాటలకే పరిమితం. ఆ చిత్రం నన్న బ్యాడ్ గా ప్రాజెక్టు చేసింది. భాక్సాఫీస్ వద్ద నిలబడలేదు..అలాంటి చిత్రాన్నినా జగన్మోహిని చిత్రం రిలీజ్ ముందు రిలీజ్ చేస్తున్నారంటే అర్ధం ఏమిటి..ఇదంతా నా దురదృష్టం..అంటూ వాపోయింది.

ఇక రాజా హీరోగా నమిత, మీరా చోప్రా ప్రధానపాత్రులగా మురళి సినీ ఆర్ట్స్‌ పతాకంపై హెచ్‌. మురళి నిర్మించిన చిత్రం 'జగన్మోహిని'. ఎన్‌.కె. విశ్వనాథన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాని ఈనెల 17న విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. అలాగే వినోదభరితంగా తయారయిన చిత్రమిది.అండమాన్‌ దగ్గర సముద్రంలో తీసిన అండర్‌ వాటర్‌ సన్నివేశాలు సినిమాకి హైలైట్‌ అవుతాయి. నమిత నటన, ఆమె గ్లామర్‌ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X