బెదిరిస్తున్నారంటూ దర్శకుడుపై హిజ్రా కంప్లైంట్

అనంతరం రోజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను 'వాయ్‌మై' చిత్రంలో హిజ్రా కలెక్టర్ పాత్ర పోషిస్తున్నాను. సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.చిత్రీకరణ మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో జరుగుతోంది. బుధవారం చిత్రయూనిట్ అనుమతితో బయటకు వెళ్లా. అన్నాసాలైలో వెళుతుండగా వెనుక కారులో కొందరు సహాయ దర్శకులు నన్ను వెంబడించారు.
కొంచెం దూరం వెళ్లాక కారు అద్దాలు పగులగొట్టి నన్ను బెదిరించారు. ఇందుకు దర్శకుడు సెంథిల్‌కుమార్, సహాయ దర్శకుడు శీనులే కారణం. వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు.
గతంలో రోజ్ స్వార్థ రాజకీయాల కారణంగా హిజ్రాల జీవితాలు దుర్భరంగా మారాయని, అందుకే తాను పార్టీ స్థాపించబోతున్నట్లు ఆమె చెప్పారు. కుంభకోణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోస్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అటు కన్నవారికి, ఇటు సమాజానికి దూరమై దుర్భరజీవనం సాగిస్తున్న తమ వ్యధ వర్ణనాతీతమన్నారు. అలాంటి వారిని ఆదుకుని, సమాజంలో వారికి సమాన హక్కులు కల్పించేందుకే రాజకీయ పార్టీ పెడుతున్నామన్నారు.


Click it and Unblock the Notifications











