నోరు జారి త్రిష ప్లాప్ అనేసింది
సినిమా రిలీజ్ కు ముందే త్రిష నోరు జారి ప్లాప్ అన్నట్లుగా మాట్లాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.వివరాల్లోకి వెళ్ళితే త్రిష రీసెంట్ గా తను నటించిన భారీ చిత్రం 'మంగత్తా'ఆడియో పంక్షన్ కి హాజరైంది.అక్కడ ఆమె మాట్లాడుతూ..'అభిమానులు తమ హీరోపై ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమా చూడటానికి వస్తారు. తీరా సినిమా వారి అంచనాలకు తగ్గట్టుగా లేకుంటే బాధపడిపోతారు. అందుకే అభిమానులను ముందే హెచ్చరిస్తున్నా... మీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకుంటే ఫీలవ్వకండి. ఓపెన్ మైండ్‌తో సినిమాను చూడండి. సినిమాను ఎంజాయ్ చేయండి' అంది.ఇది విన్న
స్టేజీ మీద వారు షాక్ అయ్యిపోయారు. సినిమా గురించి నెగిటివ్ గా ఆమె చెప్పినట్లు గుర్తించారు.అయితే అది మీడియాలో రికార్డు అయిపోయింది.ఆమె తర్వాత నాలుక కరుచుకున్నా ఫలితం లేకపోయింది.అస్సలు ఆమె మనస్సులో ఆ సినిమా ఆడుతుందని నమ్మకం లేకే అలా అలవోకగా ఆమె మనస్సులోంచి ఆ మాట బయిటకు వచ్చిందంటున్నారు. ఇక అజిత్‌తో కలిసి నటించిన 'మంగత్తా' చిత్రం కి యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు.ఈ చిత్రానికి దర్శకుడు వెంకట్ ప్రభు.అలాగే ప్రస్తుతం త్రిష వెంకటేష్ సరసన బాడీగార్డు రీమేక్ లో చేస్తోంది.


Click it and Unblock the Notifications











