Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
త్రిషాకు కమల్ హాసన్ లిప్ టు లిప్ కిస్ కన్ఫర్మ్
త్వరలో త్రిషకు, కమల్ హాసన్ తో లిప్ టు లిప్ కిస్ దొరకనుందని ఛెన్నై సినీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..కమల్ హాసన్ తన లేటెస్ట్ చిత్రానికి గానూ ఎంతోమంది హీరోయిన్స్ ని వెతికి చివరకు త్రిషనే ఫైనల్ చేసినట్లు సమాచారం.ఆయన ప్రతీ సినిమాల్లోనూ లిప్ టు లిప్ కిస్ ని హీరోయిన్స్ కు ప్రసాదిస్తూండటంతో త్రిష కూడా దీనికి మినహాయింపు కాదు అంటున్నారు. ఇక ఈ లేటెస్ట్ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామిడీగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. గతంలో తెనాలి, పంచతంత్రం, దశావతారం వంటి చిత్రాలు కమల్, రవికుమార్ కాంబినేషన్లో వచ్చాయి. ఇక త్రిషను ఇంతకుముందే కమల్ తన 'మర్మయోగి' ప్రాజెక్టు కోసం తీసుకున్నారు. అయితే అనుకోని ఆర్ధిక అవాంతరాల వల్ల ఆ ప్రాజెక్టు చివరి నిమిషంలో ఆగిపోయింది. అయితే అప్పట్లో తన ప్రక్కన ఆమె సెట్ అవుతుందా లేదా అని త్రిషకు ఫొటో షూట్ కూడా చేశారు. ఇక ఒకసారి తప్పిపోయిన అవకాశం మళ్లీ వెదుక్కొని రావటంతో త్రిషకు ఆనందడోలికల్లో మునిగితేలుతోందంటున్నారు. మరో ప్రక్క తన గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా-మీటా అనే భారీ బాలీవుడ్ చిత్రంలో చేస్తున్న సమయంలో ఈ అవకాశం రావటం ఆమెకు ఆనందాన్నిఇస్తోంది. మరో ప్రక్క శ్రీనువైట్ల కాంబినేషన్ లో రెడీ అయిన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. దీనిపై మంచి ఎక్సపెక్టెషన్స్ ఉన్న సంగతి తెలిసిందే.