సినిమాని ఓపెన్ మైండ్ తో చూడండంటున్న త్రిష
టాలీవుడ్ లో పవవన్ కళ్యాణ్, కోలీవుడ్ లో అజిత్ కి త్రిష పెద్ద ఫ్యాన్. అజిత్ తో కలిసి నటించిన మంగత్తా చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. యువన్ శంకర్ రాజా అందించిన బాణీలు అభిమానులను అలరిస్తున్నాయట. దర్శకుడు వెంకట్ ప్రభు అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెబుతోంది. ఇంకా ఈ చిత్రం గురించి త్రిష ఏమంటోంది అంటే..అభిమానులు తమ హీరోపై ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమా చూడటానికి వస్తారు. తీరా సినిమా వారి అంచనాలకు తగ్గట్టుగా లేకుంటే బాధపడిపోతారు.
అందుకే అభిమానులను ముందే హెచ్చరిస్తున్నా..మీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకుంటే ఫీలవ్వకండి. ఓపెన్ మైండ్ తో సినిమాను చూడండి. సినిమాను ఎంజాయ్ చేయండి అంటోంది. మంగత్తా విడుదల సమయంలోనే ఇలా ఎందుకు చెబుతుందబ్బా అని అజిత్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. త్రిష ఈ స్టేట్ మెంట్ ఇవ్వటం వల్ల సినిమా పోయిందన్న భావన కలుగుతుందని వారు ఫీలవుతున్నారు.


Click it and Unblock the Notifications











