సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వెల్గుతున్న త్రిష లేటెస్ట్ గా కింగ్ సినిమాలో నటించింది. నాగార్జున హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను స్వయంగా ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడాలని ఆమెకు కోరిక పుట్టింది.అయితే అది తీరాలంటే కష్టం కదా..అందుకే త్రిష బురఖా ధరించి చెన్నైలోని కాసినో థియేటర్‌కి వెళ్లింది. హాలు నిండా జనం... ఒకటే ఈలలు.. గోల! త్రిష తెర మీద కనిపించగానే అభిమానుల సందడి... ఇలా అన్నింటినీ దగ్గర నుంచి చూసి ఎంతో ఆనందించింది త్రిష. ఆమె మాట్లాడుతూ ''బురఖా ధరించి సినిమా పూర్తయ్యే వరకూ ఉండటానికి చాలా కష్టపడ్డాను. ఉక్కపోతకు తట్టుకోలేకపోయా. చప్పట్లతో థియేటర్ మార్మోగుతుంటే నా ఆనందానికి అవధులు లేకుండాపోయాయ''ని వివరించింది. అదీ సంగతి