'క్వీన్ మేరీ' అవతారమెత్తి అదరకొట్టిన త్రిష
లేటెస్ట్ గా త్రిష ..క్వీన్ మేరీ గెటప్ లో కనిపించి అందరినీ అదరకొట్టింది. అయితే అదేమీ సినిమా కోసం కాదు. ఓ ప్రెవేట్ ఫంక్షన్ కోసం. చెన్నైలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీకి ఆ విధంగా వేషధారణ అయ్యి త్రిష వచ్చారు. అయితే త్రిష అలా ప్రత్యేకంగా తయారై రావటానికి కారణం ఉంది. చెన్నయ్‌లో 'సిడ్నీ శ్లాడెన్' అని ఒక ప్రముఖ స్టార్ డిజైనర్ ఉన్నారు. ఆయన బర్త్‌డే పార్టీ ఈ నెల 21న హోటల్ తాజ్ కోరమండల్‌లో జరిగింది. ఆ పార్టీకి హాజరయ్యేవారు ఒకనాటి బ్రిటిష్ చక్రవర్తుల్లో తూడూర్ వంశస్తుల కాలానికి అద్దం పట్టేలా 'డ్రెసప్' అయి రావాలనుకున్నారు సరదాగా. బర్త్‌డే బాయ్ సిడ్నీ 'కింగ్ హెన్రీ (ఎనిమిదవ చక్రవర్తి)' గెటప్‌లో వచ్చారు. ఇప్పుడు విషయం అర్థమై ఉంటుంది. త్రిష మేరీగా ఎందుకు రావలసి వచ్చిందో. కొంతమంది మామూలుగానే వారికి నచ్చిన విధంగా ఆ పార్టీకి హాజరయ్యారు. స్వతహాగా డిజైనర్ అయినందున సిడ్నీ ఆ విధంగా మిత్రుల్ని విభిన్న వేషధారణలో రమ్మని కోరడం జరిగింది. ఈ వేడుకకు లకి, రమ్యకృష్ణ, వినయ, అజిత్, షాలిని, ప్రియ, లాలస, సంగీత, అపర్ణా, పిళ్ళై, సోనా, శ్రీకాంత్-వందన, రామ్‌కుమార్, కె.ఎస్.రవికుమార్, షాజి, కృతిక, స్టాలిన్, గిరీష్‌శక్తి, షామ్, డిజైనర్ వివేక్ కరుణాకరన్ తదితరులు హాజరయ్యారు. అదీ త్రిష..లేటెస్ట్ గెటప్ కు కారణం.ఇక త్రిష,వెంకటేష్ కాంబినేషన్లో రూపొందిన నమో వెంకటేశ చిత్రం సంక్రాతికి రిలీజ్ కానుంది.శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం పూర్తి ఫన్ తో రూపొందిందని సమాచారం. అలగే త్రిష తాజాగా కట్టా మీటా అనే హిందీ చిత్రంలో చేస్తోంది. ఆ చిత్రాన్ని ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











