నేనేదో బాత్రూమ్‌లో...అంతే త్రిష
"నేనేదో బాత్రూమ్‌లో పాడుకుంటుంటాను. రెహమాన్‌గారి ట్యూన్‌కి పాడటమంటే మామూలు విషయం కాదు. అందుకే అలాంటి ఆశలేం పెట్టుకోలేదు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల్ని రెహమాన్ ఇచ్చారు. చాలా బాగున్నాయి' అన్నారు త్రిష. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న 'విన్నైత్తాండి వరువాయా' తమిళ చిత్రానికి రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో త్రిష ఒక పాట పాడాలనుకున్నారనే వార్తలు వినిపించాయి. ఔనా..నిజమేనా అని ఆమెని అడిగితే పై విధంగా సమాధానమిచ్చింది.
ఇక వరసగా నయనతార, ప్రియమణి, అనుష్క..బికినీలు ధరించి సంచలనం సృష్టించారు. మీరూ ఆ క్లబ్‌లో చేరతారా? అని అడిగితే.."ఈ మధ్య ఏంటోనండి..మీరు కూడా బికినీ వేస్తున్నారా? అని కామన్‌గా ఓ ప్రశ్న అడిగేస్తున్నారు. నాకైతే ఈ బికినీ వ్యవహారం భలే జోకుగా ఉంది' అంది త్రిష. ఇక ఆమె తేనెని బాగా ఇష్టపడుతుంది. ఆ విషయం చెబుతూ "తేనెని ఇష్టపడనివాళ్లుంటారా? అందానికి అందం..ఆరోగ్యానికి ఆరోగ్యం..తేనె వల్ల ఈ రెండు సౌలభ్యాలు ఉన్నాయి' అన్నారామె. అంతేగాక నన్ను అంతా 'హనీ' అని పిలుస్తారు అంది వయ్యారాలు పోతూ..ఓకే హనీ. ప్రస్తుతం త్రిష నమో వెంకటేశ చిత్రంలో చేస్తోంది. ఆమె లెటెస్ట్ గా చేసిన శంఖం చిత్రం భాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.


Click it and Unblock the Notifications











