అక్కడైనా...ఇక్కడైనా త్రిషే

ప్రస్తుతం ఒక్కో సినిమాకు 65 లక్షల పారితోషికం తీసుకుంటున్న త్రిష తమిళంలోనూ మంచి ప్రాజెక్టులు చేజిక్కించుకుంటోంది. ఇప్పుడు ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలున్నాయి. ప్రకాష్‌రాజ్ సొంత సినిమా 'అభియుమ్ నానుమ్'లో ప్రకాష్‌రాజ్ కుమార్తెగా నటిస్తున్న ఆమె విష్ణువర్ధన్ డైరెక్ట్ చేస్తున్న 'సర్వమ్'లో ఆర్యకు జోడీగా నటిస్తోంది. అలాగే టెక్నికల్ డైరక్టర్ గా పేరుపొందిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'చెన్నయిల్ ఒరు మళైకాలమ్'లోనూ ఆమే హీరోయిన్. అలా రెండు భాషల్లోనూ తన హవాను కొనసాగించేందుకు తగ్గట్లుగా ఆమె తన కెరీర్‌ను మలచుకుంటోంది. అందులోనూ ఇలియానా అనుకోకుండా పోటీనుండి తప్పుకోవటం ఆమెకు బాగా కలసి వచ్చింది.


Click it and Unblock the Notifications











