ఇదే వరస: త్రిష క్లీనింగ్...బోయ్ ఫ్రెండ్ ట్వీట్లు (ఫొటోలు)
చెన్నై: ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేరకు సెలబ్రెటీలు అంతా స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రిష కూడా తన వంతు కర్తవ్యంగా స్వచ్చ బారత్ పోగ్రామ్ లో పాల్గొని రోడ్లు శుభ్రం చేసింది. ఇది ఆమె అభిమానులకు ప్రేరణగా ఉంటుందని చెప్తున్నారు.
బుధవారం ఉదయం ఆమె ఈ పోగ్రామ్ లో భాగంగా... ఎన్విరాలమెంట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వాలంటిర్స్ తో కలిసి...యానిమల్ హౌస్ ని క్లీన్ చేసింది.
ఈ విషయమై ఆమె బోయ్ ఫ్రెండ్ అని చెప్పబడుతున్న వరుణ్ ట్వీట్ చేస్తూ..క్లీనీనెస్ ఈజ్ హ్యాపీనెస్..త్రిష ఈ పోగ్రామ్ లో పాలుపంచుకుంది. మనమంతా కూడా భాగస్వాములం అవుదాం అని పిలుపుని ఇచ్చారు. ఈ ట్వీట్ కు చెన్నై బ్యూటీ రీ ట్వీట్ చేసింది.
త్రిష మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ భారత్ కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ తమ ప్రాంతాలను శుభ్రపరచాలని అదే విధంగా ఎవరికి వారు తమ ఇంటి చుట్టు ప్రక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి ఏ కార్యక్రమం జరిగనా నేను తప్పకుండా పాల్గొంటాను. ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి అని తెలిపారు.
సినిమాల విషయానికి వస్తే...
'లేసా లేసా' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి త్రిష. తమిళంలో కమల్‌హాసన్, విజయ్, అజిత్, విక్రం, సూర్యతోపాటు పలువురు అగ్రహీరోలతో ఆడిపాడిందీ అమ్మడు. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి పెద్ద హీరోలతోనే కాదు.. కుర్ర హీరోల సరసన కూడా చిందులేసింది. తాజాగా బాలకృష్ణతో ఓ చిత్రంలో నటిస్తోంది.
స్వచ్చా భారత్ లో త్రిష ...ఫొటోలు...

సినిమాకే ప్రయారిటీ...
ముందు సినిమా తరువాతే పెళ్లి అంటున్నారు చిరునవ్వుల చిన్నది నటి త్రిష. ఈమెలో ప్రత్యేకత ఏమిటంటే సినిమాకు పరిచయం అయినప్పడు నవనవలాడుతూ ఎంత అందంగా ఉన్నారో నేటికీ మాయని అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. నటిగా దశాబ్ద కాలం దాటినా నేటికీ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిల పరచుకుంటున్నారు. త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబుకు జంటగా నటించడానికి రెడీ అవుతున్నారు.

అదే దర్శకుడుతో...
ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే తెలుగు చిత్రంలో నటించారు. అదే విధంగా శింబు సరసన ఇప్పటికే విన్నై తాండి వరువాయో చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజమే.

ఫేవెరెట్ దర్శుడుతో...
పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ నిర్మించనున్న ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ తన అభిమాన దర్శకుల్లో సెల్వరాఘవన్ ఒకరన్నారు. అలాంటి దర్శకుడితో మరోసారి కలసి పని చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సెల్వరాఘవన్ నెల క్రితం ఈ చిత్ర కథ చెప్పారన్నారు. కథ చాలా నాలెడ్జీగా ఉందనిపించిందని అన్నారు. దశాబ్దం దాటినా హీరోయిన్‌గా వరుస అవకాశాలు వరిస్తున్నాయి. మరి పెళ్లి సంగతేమిటన్న ప్రశ్నకు తనకు సినిమానే ఫస్ట్ అని మ్యారేజ్ తరువాత అని త్రిష పేర్కొనడం విశేషం.

రాజీ పడని తత్వం...
త్రిష కు చెప్పుకోతగ్గ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం. బాలకృష్ణ తో చేస్తున్న చిత్రం కోసం ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది.

అజిత్ తో...
త్రిష తమిళంలో ఓ చిత్రం చేస్తోంది. అందులో త్రిష తన అభిమానులకు ఆనందం కలిగించేలా స్పెషల్ లేదా ఐటం సాంగ్ చేస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు..అజిత్ తో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న చిత్రం. ఈ చిత్రం అనుష్క హీరోయిన్ కావటం విశేషం. ఈ విషయాన్ని తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ తెలియచేసారు.
'తల' అజిత్ 55వ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆ సినిమాకు పేరుపెట్టకపోయినా.. 'తల - 55' పేరుతో ఇప్పటికే పోస్టర్లు, బ్యానర్లు నగరంలో భారీగా దర్శనమిస్తున్నాయి. గౌతంమీనన్ దర్శకత్వంలోని ఈ సినిమాలో అనుష్క కథానాయిక. త్రిష ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇందులో ఆమె ఓ ప్రత్యేక గీతంలో చిందులేసినట్లు సమాచారం.
గౌతంమీనన్ దర్శకత్వంలో 'కాక్క కాక్క' వంటి పలు సినిమాలలో అవకాశాలు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల అజిత్ నటించలేదు. చాలా కాలం తర్వాత వారి కాంబినేషన్లో యాక్షన్ కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. అజిత్ పోలీసు పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డాన్ మెక్కాతర్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.
షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. క్లెమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. రెండు పాటలు, కొన్ని ప్యాచ్ సన్నివేశాలే ఉన్నాయి. ఈ నెలాఖరులో సినిమా పేరు ప్రకటించి.. ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











