ఆ నిర్మాతతో ఏ ఎఫైర్ లేదు...త్రిష ఖండన
తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి..హాట్ హీరోయిన్ త్రిషకు తన మనవడు ఉదయగరి స్టాలిన్ తో తిరగవద్దని వార్నింగ్ ఇచ్చాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ తన కెరీర్ లో ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు పుట్టిస్తున్న రూమర్స్ అని త్రిష కొట్టిపారేసింది. ఈ విషయాన్ని మీడియా వద్ద వివరిస్తూ...నా ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు పుట్టించిన పుకారు ఇది. ఇంతకు ముందు, కూడా ఇలాంటివి చాలానే నా విషయంలో క్రియేట్ చేశారు. ఇలాంటి వాటిని చూసి నేను భయపడను. నాకు సినిమాతో తప్ప ఎవరితో సంబంధం లేదు అని అంది. అయితే త్రిష, ఉదయగిరి ప్రేమ వ్యవహారాన్ని ఉదయ్ తండ్రి స్టాలిన్ చాలా తీవ్రంగా పరిగణించారని సమాచారం. అంతేకాక, ఇటీవలే ఆయన త్రిషకు వార్నింగ్ ను కూడా జారీ చేశాడని తమిళనాడులో మీడియాలో జోరుగా వినపడుతోంది. ప్రస్తుతం త్రిష..ఉదయ్ తో సినిమా చేయాలా వద్దా అనే డైలమోలా ఉంది.


Click it and Unblock the Notifications











