తెరుచే ఉంచానంటున్న త్రిష
నాకంటూ దాచుకొనే రహస్యాలేం లేవు.నేను తెరిచిన పుస్తకాన్ని.అయినా ఏమైనా సీక్రెట్స్ ఉన్నా... ఏదో విధంగా మూడోకంటికి చేరిపోతాయి అంటోంది త్రిష.ఆమె పెళ్లి చేసుకోబోతందంటూ మరో మారు వచ్చిన వార్తలను మరో మారు ఖండిస్తూ త్రిష ఇలా చెప్పుకొచ్చింది.అలాగే త్రిష అలా చేసిందట, ఇలా చేసిందట అని ఏవేవో చెప్పుకొంటారు. అందులో పది మందికీ పనికొచ్చే విషయాలేమిటో నాకు అర్థం కాదు.ఒక్కోసారి నాకు సంబంధం లేని వార్తలు కూడా పుట్టేస్తాయి. మొన్నటి వరకూ ప్రేమ వ్యవహారాల గురించి చెప్పుకొనేవారు. ఇప్పుడు పెళ్లి సంగతులు వస్తున్నాయి.
నేను త్వరలో పెళ్లి చేసుకొంటున్నానని, మా ఇంట్లోవాళ్లు ఇప్పటికే రెండు సంబంధాలు చూశారని ఈ మధ్య రూమర్స్ పుట్టాయి. పెళ్లి అనేది జీవితంలో మధురమైన ఘట్టం. నేనంటూ పెళ్లి చేసుకొంటే... అందుకు సంబంధించిన ప్రతి విషయం అందరికీ చెబుతాను. అంది. ప్రస్తుతం త్రిష..వెంకటేష్ సరసన బాడీగార్డు చిత్రంలో చేస్తోంది. తెలుగులో బాడీగార్డు తప్ప ఏ సినిమానూ లేదు.దాంతో ఆమె ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీసు ఫలితమే త్రిష కెరీర్ ని నిర్ణయించనుంది.


Click it and Unblock the Notifications











