త్రిష ని విడిచి పెట్టని కమల్ హాసన్
ఆ మధ్య కమల్ హాసన్ తన 'మర్మయోగి' చిత్రం కోసం త్రిషను ఎంపిక చేసి 'సిలంబం' అనే మార్షల్ ఆర్ట్స్ లో సైతం దగ్గరుండి శిక్షణ ఇప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ఆగిపోవటంతో త్రిషతో ఆయన టచ్ లో లేరు. అయితే అప్పుడిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు తాజాగా రూపొందిస్తున్న 'యావరుమ్ కేళీర్' (అందరూ వినండి) అనే చిత్రంలో ఆమెకు తన ప్రక్కన చేసే అవకాశం ఇవ్వటానికి రెడీ అయ్యారు. 'దశావతారం' దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరక్షన్ లో రానున్న ఈ చిత్రానికి ఉదయనిధి స్టాలిన్ నిర్మాత.ఈ విషయంపై త్రిష కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆమె స్పందిస్తూ...'కమల్ సినిమాలో నటించే అవకాశంనా అదృష్టం. అయితే కమల్ ఫోన్ చేసి ఆ మ్యాటర్ చెప్పుతారని ఎదురుచూస్తున్నాను' అంటోంది నవ్వుతూ. ఇక ఈ చిత్రంలో నిర్మాత ఉదయ నిధి స్టాలిన్ సైతం ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభించి దీపావళి కి విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగులలో ఒకేసారి విడుదల చేయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇక సంక్రాంతికి వెంకటేష్ తో ఆమె చేసిన నమో వెంకటేశ చిత్రం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఆమె ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా-మీటా అనే చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











