For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'దూకుడు‌', 'బాద్షా‌'సాంగ్ లకు త్రిష డాన్స్ (వీడియో)

  By Srikanya
  |

  చెన్నై: తెలుగు నుంచి తమిళం కు, తమిళం నుంచి తెలుగుకు పాటలు రావటం కామనే. అందులోనూ సంగీత దర్శకుడు ఒకడే అయినప్పుడు మరీను. ఆ మధ్యన మహేష్ బాబు నటించిన దూకుడు చిత్రంలో సూపర్ హిట్టైన ఇటు రాయే ఇటు రాయే నీ మీద మనసాయే పాట చూసే ఉంటారు. ఆ పాటను తమన్ ...ఇప్పుడు ఓ తమిళ చిత్రం కోసం కొట్టారు. ఆ చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేసింది. ఆ సాంగ్ ఈ ట్రైలర్ లో చూడండి

  త్రిష నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'సకలకళా వల్లవన్‌' .తమిళ దర్శకుడు సూరజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఈ చిత్రంలో తమిళ హీరో జయం రవి, నటి త్రిష, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  అలాగే ఎన్టీఆర్ ది కూడా...

  బంతిపూల జానకి.. జానకి అంటూ బాద్ షా మూవీలో జూనియర్- కాజల్ వేసిన స్టెప్పులు గుర్తుండి ఉండి ఉంటుంది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ పాట అప్పట్లో అభిమానులతో చిందులు వేయించింది. ఎస్ఎస్ థమన్ సంగీతంలో దలేర్ మెహందీ పాడిన ఈ పాట చిత్రీకరణ అంతా కూడా మంచుకొండల్లో జరిగింది.

   Trisha dance for Ntr and Mahesh Super hit songs

  థమన్ క్యాచీ ట్యూన్ కు.. ఎన్టీఆర్- కాజల్ స్టెప్పులు కూడా తోడవ్వడంతో పాట ఇన్ స్టంట్ హిట్ అయింది. బాద్ షా సినిమా పేరు ఎత్తగానే మ్యూజిక్ లవర్స్ కు ఈ పాటే గుర్తు వస్తుంది. ఇప్పుడీ సూపర్ హిట్ సాంగ్ ట్యూన్ ను యాజ్ టీజ్ గా వాడేస్తున్నాడు థమన్.

  జులై 31న చిత్రం విడుదల కాన్నట్లు త్రిష తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఎస్‌. తమన్‌ చిత్రానికి సంగీతం అందించారు. త్రిష చేసిన ట్వీట్ ని ఇక్కడ చూడండి.

  జయం రవి, త్రిష, అంజలి, సూరి తదితరులు ముఖ్య తారాగణంగా ఈ చిత్రం రూపొందింది. కథానుసారం సరదాగా తిరిగే జయం రవి కాలక్షేపం కోసం అంజలిని ప్రేమిస్తాడు. ఆమె మాత్రం నిజంగా ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకోవాలంటూ జయం రవిపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో తప్పించుకుని చెన్నై చేరిన జయం రవి... ఇక్కడ త్రిషను సీరియస్‌గా ప్రేమిస్తాడు.

  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ ఇద్దరూ పొల్లాచ్చికి చేరుకోవడం, అక్కడ ఇంకా జయం రవి కోసం అంజలి నిరీక్షించడం, ఆమె త్రిషను కలుసుకోవడం... ఈ పరిణామాలతో వారి మధ్య చిక్కుకుని సూరి ఇబ్బంది పడటం వంటి సన్నివేశాలను తెరపై చూడాల్సిందేనని యూనిట్‌ చెబుతోంది. జయం రవి చివరకు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడనేదే క్త్లెమాక్స్‌.

  పూర్తిస్థాయి హాస్య చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో తొలిసారిగా జయం రవికి జోడీగా త్రిష నటిస్తోంది. అంజలి రీ ఎంట్రీ చిత్రంగా ప్రత్యేకత సంతరించుకుంది. 'అలెక్స్‌ పాండియన్‌' పరాజయం తర్వాత ఈ చిత్రంపై దర్శకుడు సురాజ్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

  సురాజ్‌ దర్శకత్వంలో లక్ష్మీ మూవీ మేయర్స్‌ పతాకంపై దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్రిష,అంజలిలకు ఇక్కడ మార్కెట్ ఉండటం ప్లస్ అవుతుంది.

  English summary
  The upcoming Jayam Ravi​, Trisha​ and Anjali​ starrer 'Sakalakala Vallavan' with music scored by Thaman S​
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X