త్రిషకి తిక్క రేగింది
త్రిష, శింబు ప్రేమలో మునిగితేలుతున్నట్లు వస్తున్న వార్తలను అందరిలాగే త్రిష వెంటనే ఖండించింది. మీకేమన్నా మతిపోయిందా..నేను శింబు ప్రేమలో పడటమేమిటని తమిళ పత్రికల వారిపై మండిపడింది. అయినా ఇప్పుడున్న పరిస్ధితుల్లో నాకు సినిమాలే ముఖ్యం. శింబుతో ప్రేమిస్తున్నా..ఫలానా వారితో తిరుగుతున్నా వంటి రూమర్స్ అస్సలు పట్టించుకోను. ఇక పెళ్ళంటారా భవిష్యత్ లో నాకు నచ్చిన వ్యక్తి ఎప్పుడో అప్పుడు కనపడకపోడు..అతనితో లైఫ్ లీడ్ చేస్తానని చెప్పింది. అలాగే హీరోయిన్స్ కి గుళ్ళు కడుతున్నారు..మరి మీరెప్పుడు కట్టించుకుంటారు అంటే...మేమేమన్నా దేవుళ్ళమా..మా గుళ్ళు కట్టమనడానికి అని నమిత, నయనతారలకు చురకలంటించింది. అయినా నా ఫ్యాన్స్ ని సామాజిక సేవ చేయమని చెప్తాను అంది. ముందు నువ్వు ఆ సామాజిక సేవేదో ప్రారంభించవమ్మా తర్వాత మీ ఫ్యాన్స్ కి చెప్తువు గానీ అన్న ఫీలింగ్ తో ఆ జర్నలిస్టులు వెనుతిరిగారు. అయినా త్రిష మూడ్ బాగున్నప్పుడు వెళ్ళాలి గానీ తిక్కరేగినప్పుడు వెళితే ఇట్లాగే ఉంటుంది..అదీ సంగతి.


Click it and Unblock the Notifications











