Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అతనితో ప్రేమ తెరవరకే...త్రిష ఖండన
మేమిద్దరం ప్రేమికులనే వార్తను చాలామంది ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. శింబు నాకు మంచి స్నేహితుడు మాత్రమే. మా ప్రేమ కేవలం తెరవరకే అంటూ ఖండిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చింది తాజాగా త్రిష. ఆమె లేటెస్ట్ గా నటించిన 'విన్నైత్తాండి వరువాయా' ఈ శుక్రవారమే రిలీజవుతోంది. గౌతం మీనన్ దర్శకత్వంలో రెడీ అయిన ఆ చిత్రం గురించి చెపుతూ...అది మంచి రొమాంటిక్ ఫిల్మ్. ఇప్పటివరకు ప్రేమకథా చిత్రాలు చాలానే చేశాను. కానీ ఈ తరహా చిత్రం మాత్రం చెయ్యలేదు. కచ్చితంగా మీ అందరి హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుందీ సినిమా.
ఇలాంటి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నేను మలయాళీ క్రిస్టియన్ అమ్మాయిగా నటించాను. నా పాత్ర పేరు జెస్సి. సింపుల్గా ఉంటాను. నా వస్త్రధారణ అందుకు తగ్గట్టుగా ఉంటుంది. సాదాసీదా కాటన్ చీరల్లో కనిపిస్తాను. హుందాగా ఉంటుంది నా పాత్ర. అలాగే ఈ చిత్రంలో శింబు, నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశాం. మా ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలున్నాయి. మా మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది.అంత మాత్రానికి ఏవేవో ఊహించుకోవద్దు అని చెప్తోంది.