పారిశ్రామిక వేత్తతో పెళ్ళి వార్తపై త్రిష స్పందన
త్వరలో ఓ పారిశ్రామిక వేత్తను త్రిష పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్త అంతటా హంగామా క్రియోట్ చేసింది. తమిళ మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చిన ఈ వార్తను ఆధారం చేసుకుని ఆమెకు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. అయితే త్రిష ఇదంతా రూమర్ అని కొట్టిపారేస్తోంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...అసలు పెళ్లి విషయం మా ఇంట్లోనే చర్చించలేదు. కానీ కొన్ని పత్రికలు పెళ్లి, పెళ్లి పీటలు అంటూ ఏవేవో రాశాయి. నా మీద వస్తున్న వార్తలన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నవే. ఎందుకిలా రాస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల మీదే అని చెప్పింది.ప్రస్తుతం త్రిష..అజిత్ తో మంగత్తా చిత్రం, వెంకటేష్ సరసన సావిత్రి, పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











