ఈ మధ్యన ఓ ఇంటర్వూలో త్రిషని మీడియా వారు మీ డ్రీమ్ రోల్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. దానికామె సమాధానంగా ఫలానా పాత్ర చేయాలన్న ప్రత్యేక కోరికలేం లేవు. అయితే ఎప్పటినుంచో నాకు పవన్ కళ్యాణ్ ప్రక్కన నటించాలనుంది.అయితే అది తీరటం లేదు.అందులోనూ నేను పవన్ కి గ్రేట్ ఫ్యాన్ ని అని చెప్పుకొచ్చింది. దాదాపు అందరి పెద్ద హీరోల ప్రక్కన చేసిన త్రిష చిరంజీవి ప్రక్కన కూడా స్టాలిన్ సినిమాలో చేసింది. కానీ ..పవన్ ప్రక్కన ఎప్పుడూ ఆమెకు నటించే అవకాశం రాలేదు. అయితే ఇది పవన్ ప్రక్కన వేషం కోసం వేసే ట్రిక్ అనుకున్నా ఇద్దరి కాంబినేషన్ మాత్రం చూడచక్కగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయినా పవన్ ఒక్కసారి ఆమెకు అవకాశం ఇస్తే ఏం పోయింది..అభిమానులు కూడా ఆనందిస్తారు కదా...