సెలబ్రిటీ స్టేటస్ అక్కడ చెల్లదని త్రిషకు గడ్డి పెట్టారు...!?
ఓటు హక్కు వినియోగించుకోవాలనే సూత్రాన్ని నమ్మే త్రిష అందుకు తగ్గట్టే పోలింగ్ బూత్ ఎవరైనా సమానమే అనే సంగతి మరిచిపోయింది. చెన్నైయ్ లో ఓటు వేసేందుకు వెళ్లిన త్రిష క్యూలో నిలబడకుండా సరాసరి ఓటు వేయడానికి వెళుతుంటే ఒకతను ఆమెని నిలదీశాడు. క్యూలో నిలబడాలంటూ డిమాండ్ చేశాడు. మొదట్లో అతనితో గొడవ పడ్డ త్రిష తన సెలబ్రిటీ స్టేటస్ అక్కడ చెల్లదని తెలుసుకుని క్యూలో నిలబడి ఓటేసింది. అతనితో వాగ్వాదానికి దిగి ఉండే దానిని కాదని, కాకపోతే అతను మరీ దురుసుగా మాట్లాడే సరికి గొడవపడ్డానని చెప్పింది. అయితే త్రిష బాధ అంతా అతను తనని కనీసం హీరోయిన్ అనే ఫీలింగ్ తో అయినా చూడకుండా పదిమందిలో అలా తిట్టిపోశాడనే అంటూ మీడియా కవ్విస్తోంది.
More from Filmibeat
trisha teen maar pawan kalyan jayant c paranji ganesh babu త్రిష తీన్ మార్ పవన్ కళ్యాణ్ జయంత్ సి పరాన్జీ గణేష్ బాబు


Click it and Unblock the Notifications











