ఎదుగుదలని చూసి ఓర్వలేకే ఈ ఏడుపు...త్రిష
'ఎదిగేవారిని కిందకి లాగాలనుకోవడం చాలా బాధాకరం' అంటూ తనను డ్రగ్ కేసులో ఇరికించటాన్ని గురించి చెప్పుతోంది. అలాగే నా ఎదుగుదల చూసి ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారని చెడామడా తిట్టిపోస్తోంది. ఇటీవల మాదక ద్రవ్యాల కేసులో టాలీవుడ్ ప్రముఖుల లిస్టులో ఆమె పేరు కూడా ప్రస్దావనకొచ్చిన సందర్భంగా ఆమె ఇలా తీవ్రంగా తమిళ మీడియా వద్ద ఖండించిది. తను చేయని పనిని చేశానంటూ మీడియా పదే పదే దుష్ర్పచారం చేస్తూ పరువు తీసిందని వాదిస్తోంది. అలాగే తాను ప్రతిగా న్యాయపోరాటానికి సిద్ధమేనని, అదే పనిమీద ఉన్నానని అంటోంది.ఇక ఇప్పటికే తన వ్యక్తిగత న్యాయవాదిని అందుకోసం సంప్రదించినట్టు కూడా చెబుతోంది. ప్రస్తుతం త్రిష కమల్ హాసన్ సరసన 'మన్మధన్ అంబు" చిత్రంలో నటిస్తోంది. కొడైకెనాల్ లో షూటింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











