త్రిష కొత్త అభిరుచికి కమల్ ఫుల్ ఎంకరేజ్ మెంట్....
తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన బ్యూటీస్టార్ త్రిష ఇప్పటివరకు తన మాతృభాష తమిళ్ లో కూడా డబ్బింగ్ చెప్పకపోవడం విశేషం. అయితే మొదటిసారి తాజా చిత్రం 'మన్మథన్ అంబు"లో డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ చేసుకుందట. దీనికి హీరో కమల్ హాసన్ ఎంకరేజ్ మెంట్ చాలా వుందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ టైమ్ లో కమల్ దగ్గర ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని, తనతో డబ్బింగ్ దగ్గరుండి మరీ చెప్పిస్తానని కమల్ ప్రామిస్ చేసారని చెప్తున్న త్రిష ఈ సినిమా కోసం తన గొంతు సవరించుకోబోతుంది. కమల్ తో చేసే సినిమా ద్వారా తన గొంతుని ప్రేక్షకులకు వినిపించబోతున్నందుకు చాలా సంతోషంగా వుందని చెప్తున్న త్రిష మరి తెలుగులో కూడా ఈ సాహసానికి పూనుకుంటుందో లేదో మాత్రం చెప్పడంలేదు.
More from Filmibeat
త్రిష కమల్ హాసన్ మన్మధన్ అంబు మాధవన్ కెయస్ రవికుమార్ ఉదయనిధి స్టాలిన్ trisha kamal hassan manmadhan ambu madhavan ks ravikumar udhayanidhi stalin


Click it and Unblock the Notifications











