రిప్రెష్ కోసమే త్రిష బ్యాంకాక్ ట్రిప్
త్రిష తాజాగా బ్యాంకాక్ వెళ్ళటానికి నిర్ణయించుకుంది. అక్కడ ఓ పదిహేను రోజులు పాటు పూర్తి స్దాయిలో ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని ఆమే చెప్తోంది. ఉన్న ఒక్క జీవితాన్ని ఎంజాయ్ చేయకపోతే వృధా అంటోంది. గ్యాప్ తీసుకోకుండా వరుసగా షూటింగ్‌లు చేసినప్పుడు 'బ్రేక్' తీసుకోవాలి..రిప్రెష్ అవ్వాలనేది ఆమె ధీరి. గత ఏడాది ఆరంభంలో అలానే ఆమె రెస్ట్ తీసుకున్నారు. తన స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. దాదాపు పదిహేను రోజుల పాటు సినిమాలను గుర్తు చేసుకోకుండా పూర్తిగా ఎంజాయ్ చేసి చెన్నై చేరుకున్నారు. అలాగే అప్పుడు ఆస్ట్రేయాలో త్రిష స్కూబా డైవింగ్ నేర్చుకుంది.
అప్పట్నుంచి మొన్న మొన్నటివరకు షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్న త్రిషకి మళ్లీ బ్రేక్ తీవాలనిపించింది.అందుకు బ్యాంకాక్ సరైన ప్రాంతమని భావిస్తోంది. ప్రస్తుతం తమిళంలో విన్నైత్తాండి వరువాయా, తెలుగులో నమో వెంకటేశ, హిందీలో కట్టా మీఠా చిత్రాల్లో నటిస్తూ త్రిష బిజీగా ఉన్నారు. విన్నైత్తాండి వరువాయా, నమో వెంకటేశ షూటింగ్స్ పూర్తయ్యాయి. కట్టా మీఠా షెడ్యూల్ ఆరంభమవ్వడానికి ఇంకా టైమ్ ఉందట. అందుకే ఈ బ్యాంకాక్ టూర్ పెట్టింది.క్రిందటసారిలాగే తన స్నేహితులతో కలిసి ఆమె ఈ హాలిడేని ఎంజాయ్ చేయాలనుకుంటున్నానంటోంది. ఈసారి కూడా 'అడ్వంచరస్ గేమ్స్' నేర్చుకోవాలను కుంటున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











