ఆ హీరోతో త్రిష తిరుగుళ్ళు
త్రిష ప్రేమలో పడిందనే వార్త అంతటా చక్కర్లు కొడుతోంది. గౌతమ్ మీనన్ దర్సకత్వంలో చేస్తున్న ఆమె ఆ సినిమా హీరో శింబుతో వ్యవహారం నడుపుతోందంటూ యూనిట్ సభ్యులు బహిరంగంగానే చెప్తున్నారు.కొద్ది రోజులుగా త్రిష, శింబు లు కలిసి తిరుగుతున్నారని, డేటింగ్ చేస్తున్నారని వినపడుతోంది. అలాగే మరి కొద్ది రోజుల్లో వీరి వ్యవహారం ముదిరి సీరియస్ రిలేషన్ షిప్ కి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అయితే శింబు..గతంలో నయనతారతో బాగా ముందుకు వెళ్ళి ఆమెను రోడ్డుపై పెట్టాడు. ఆ విషయం త్రిష తో చెపితే శింబుని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు..అంతను అందరిలాంటివాడు కాదు..అని సమర్ధిస్తోంది. ఇక శింబు కూడా త్రిష తో డేటింగ్ అని అడిగితే ముసిముసి నవ్వులు చిందిస్తున్నాడు. నయనతార మాత్రం ఈ విషయం తెలిసినా తెలియనట్లే త్రిషతో బిహేవ్ చేస్తోంది. అయితే కొందరు మాత్రం శింబు తో పనిచేసే ప్రతి హీరోయిన్ షూటింగ్ అయ్యే లోగా దగ్గరవుతుందని, రిలీజ్ అయ్యే లోగా దూరమవుతుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











