త్రిష, నమిత దానికి ఎడిక్టయ్యి అలా...
త్రిష, నమిత ఇద్దరూ చెన్నైలోని నంగుమ్ బాకమ్ సబ్ వే హోటల్ లోని ఫుడ్ కి బాగా ఎడిక్టయ్యారట. దాంతో అక్కడ చాలా రుచిగా, శుచిగా ఫుడ్ ఉంటుందిని చెప్తున్నారు. అలాగే అక్కడ వీళ్ళద్దరే కాకుండా చాలా మంది ఆర్టిస్టులు ఆహారం కోసం దీన్ని ఆశ్రయిస్తారు. ఇక అక్కడకి వెళ్లటానకి టైమ్ త్రిషకి, నమితకి లేకపోతే ఆ హోటల్ వాళ్ళకు ఫోన్ చేసి వారి బోయ్ ద్వారా తెప్పించుకు తింటారట. ఇక ఇలాంటి ఆర్డర్ వచ్చినప్పుడు ఆ డెలివరీ బోయ్స్ లో నేను పట్టుకెళ్తానంటే...నేను అని పోటీ ఏర్పడుతుందిట. ఇక చెన్నై దగ్గరలోగానీ, చెన్నైలోగానీ షూటింగ్ జరిగితే మొహమాటం లేకుండా మేనేజర్ ని పిలిచి ఆ సబ్ వే నుంచే ఫుడ్ తెప్పించమని పురమాయిస్తారని సమాచారం. మొత్తానికి వీళ్ళద్దరూ ఆ హోటల్ నుంచే ఫుడ్ తెప్పించుకుంటున్నారని వార్త పాకటంతో ఆ హోటల్ కి మరింత బిజెనెస్ పెరిగింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











