ప్రేక్షకులని పలకరించడానికి మళ్ళీ రెడీ అయిపోని గేంబ్లర్ త్రిష..!
అందాల భామ త్రిష త్వరలో అజిత్ తో కలిసి నటించిన చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించడానికి మళ్లీరెడీ అయిపోతోంది. బాలీవుడ్ లో కలిసిరాక దక్షిణాదికే తిరిగి వచ్చింది. అజిత్ 50వ చిత్రంగా రూపొందిన 'మంగత్తా" చిత్రంలో అజిత్ కు జోడీగా త్రిష నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'గేంబ్లర్" పేరుతో విడుదల చేయబోతున్నారు.
ఇటీవల 'రంగం", కాంచన, నా పేరు శివ వంటి అనువాద చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ లభించడంతో 'ప్రేమలేఖ" చిత్రం తర్వాత తెలుగులో పెద్దగా మార్కెట్ లేని అజిత్ నటించిన 'మంగత్తా" చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో అనువాద చిత్రాల హవా కొనసాగుతున్నందున 'గేంబ్లర్" చిత్రాన్ని త్వరగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ తో మలయాళ బాడీగార్డ్ రీమేక్ లో నటిస్తున్న త్రిష 'గేంబ్లర్"తో తెలుగు ప్రేక్షకులని ఏవిధంగా అలరిస్తుందో చూద్దాం!


Click it and Unblock the Notifications











