తమిళనాడులో త్రిష సూపర్‌స్టార్
త్రిషకు ఇప్పుడు తమళనాడులో సూపర్ స్టార్ హోదా లభించింది. తెలుగులో సూపర్‌హిట్ అయిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? సినిమా రీమేక్ నేడు తమిళంలో విడుదలైంది. ఈ సినిమాలో హీరో కంటే హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉండడంతో చెన్నైలో ఈ సినిమా విడుదలైన థియేటర్లన్నింటి ముందు త్రిష భారీ బ్యానర్లు కనిపిస్తున్నాయి. తెలుగులో ఎంఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ కాగా సిద్ధార్ధ హీరో. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథ కంటే కథనానికి ప్రాధాన్యం ఉంది. తమిళ వెర్షన్‌లో జయం రవి హీరోగా నటించాడు. ఈ సినిమా పబ్లిసిటీలో త్రిషను హైలైట్ చే సి రవిని డమ్మీగా మిగిల్చారు. ఈ సినిమా తెలుగులో లాగే తమిళంలో సూపర్‌హిట్ అయితే త్రిషతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఈ సినిమాతో పాటు త్రిష ఆశలు విక్రంతో నటించిన భీమ సినిమా మీద ఉన్నాయి. తెలుగులో ఆమె చిరంజీవి సరసన స్టాలిన్‌లో నటిస్తోంది. ఆ తర్వాత వెంకటేష్‌తో ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలో నటించనుంది.


Click it and Unblock the Notifications