కాజల్, త్రిష కలిసి గోవాలో ఎంజాయ్
త్రిష, కాజల్ ఇప్పుడు మంచి ప్రెండ్స్ అయ్యిపోయారు. వీరిద్దరూ కలిసి న్యూ ఇయిర్ ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగిన ప్లేస్ గోవానే అని నిర్ణయించుకున్నారు. అలాగే వీరితో పాటు రీమేసేన్ కూడా కలవనుంది. వీరందరికీ గోవానే ఫేవరెట్ ప్లేసు అని చెప్తున్నారు. ఇక ఆ రాత్రి న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ ని ఓ రేంజిలో సెలబ్రేట్ చేసుకోవాలని త్రిష తన ప్రెండ్స్ తో ఇప్పటికే ప్లాన్స్ వేస్తోంది. న్యూ ఇయిర్ ముందు రోజు,తర్వాత రోజు ఏ పనులు పెట్టకోకుండా కేవలం ఈ సెలబ్రేషన్స్ మీదే ఉండాలని త్రిష ఆలోచన. ఇక కాజల్ కూడా తను కూడా ఈ సెలబ్రేషన్స్ ని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యాలని నిర్ణయించుకున్నానని చెప్తోంది.
ఇక తమకు బాగా కావాల్సిన వాళ్లని మాత్రమే ఈ ముద్దుగుమ్మలు ఆ న్యూ ఇయిర్ పార్టీకి పిలుస్తున్నారు. ప్రస్తుతం త్రిష..ఎన్టీఆర్ తో దమ్ము చిత్రం చేస్తోంది. కాజల్ చేసిన బిజినెస్ మ్యాన్ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే త్రిష చేసిన వెంకటేష్ బాడీ గార్డు కూడా సంక్రాంతికే విడుదల అవుతోంది. ఇద్దరు హీరోయిన్స్ సంక్రాంతికి పోటీ పడనున్నారు. ఇద్దరూ తమ తమ చిత్రాలపై బాగా నమ్మకం పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











