త్రిష పెళ్లి వ్యవహారంలో ఊహించని ట్విస్టు.. శింబు వివాహానికి అడ్డుగోడగా అతడేనంట!

తమిళ చిత్ర పరిశ్రమలో గత కొద్దికాలంగా త్రిష కృష్ణన్, శింబు పెళ్లి వార్తలు జోరందుకొన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు వెలుగులోకి వచ్చిన రూమర్లపై ఎవరూ పెదవి విప్పడం లేదు. కానీ త్వరలోనే త్రిష, శింబు వివాహం చేసుకోవడం ఖాయమనే వాదనను సినీ వర్గాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి పెళ్లి విషయంపై శింబు తండ్రి ప్రవర్తన, తీరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా శింబు తండ్రి టీ రాజేందర్ ప్రవర్తించిన తీరు ఎలా ఉందంటే..

త్రిష, శింబు జోరుగా కలిసి

త్రిష, శింబు జోరుగా కలిసి

పెళ్లి వార్తలు జోరందుకొన్న తర్వాత త్రిష, శింబు మరింత దగ్గరయ్యారు. అంతేకాకుండా శింబు తన వివాదాస్పద ప్రవర్తనను పూర్తిగా మార్చుకొని ప్రధానంగా కెరీర్‌పై దృష్టిపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో త్రిష, శింబు కలిసి దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలింలో నటించారు.

లాక్‌డౌన్ తర్వాత బుద్దిగా శింబు

లాక్‌డౌన్ తర్వాత బుద్దిగా శింబు

లాక్‌డౌన్ తర్వాత శింబు పలు దేవాలయాలను సందర్శించుకొని సుశీంద్రన్ దర్శకత్వంలో మొదలైన సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. ఈ సినిమా కోసం నెల రోజులపాటు డేట్స్ కేటాయించినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా లాక్‌డౌన్‌లో 20 కేజీల బరువు తగ్గి నాజుకుగా తయారయ్యాడు.

శింబుకు షాకిచ్చిన టీ రాజేందర్

శింబుకు షాకిచ్చిన టీ రాజేందర్

ఇలా త్రిష కోసం శింబు తన ప్రవర్తను మార్చుకొంటున్న సమయంలో ఆయన తండ్రి టా రాజేందర్ గట్టిగా షాక్ ఇచ్చాడు. తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించి త్వరలో జరుగనున్న నిర్మాతల మండలి ఎన్నికల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాను, తన స్నేహితుడు పోటీ చేస్తున్నామని వెల్లడించారు.

కొడుకు పెళ్లిపై చిరాకుపడ్డ టీ రాజేందర్

కొడుకు పెళ్లిపై చిరాకుపడ్డ టీ రాజేందర్

అయితే రాజేందర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండగా త్రిష, శింబు పెళ్లి విషయంపై స్పందించమని కోరితే కాస్త చిరాకుపడ్డారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ ప్రశ్నను పట్టించుకోకుండా మరో ప్రశ్నకు సమాధానం ఇవ్వడం మీడియాను ఆశ్చర్యానికి గురిచేసింది.

Recommended Video

Actor Prakash Raj's Green India Challenge | Praised CM KCR
 త్రిషతో పెళ్లి ఇష్టం లేకనే అంటూ

త్రిషతో పెళ్లి ఇష్టం లేకనే అంటూ

త్రిష, శింబు పెళ్లిపై టీ రాజేందర్ స్పందించిన తీరుతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. త్రిషను శింబు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఆయన ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. అందుకే శింబు తన పెళ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనే వాదన తెరపైకి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X