Trisha- Thalapathy Vijay: దళపతి విజయ్‌తో రిలేషన్‌పై బీజేపీ నేత వ్యాఖ్యలు... త్రిష స్ట్రాంగ్ వార్నింగ్
కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌కి అగ్రనటి త్రిషతో ఎఫైర్ ఉందంటూ తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాలతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. తాజాగా ఈ వివాదంపై సినీ నటి త్రిష స్పందించారు. ఈ మేరకు తన లాయర్ ద్వారా నోట్ విడుదల చేశారు. ఆమె ఈ ఇష్యూపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? బీజేపీ నేతపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ వివరాల్లోకి వెళితే...
కోలీవుడ్‌లో హిట్ పెయిర్
కోలీవుడ్‌లో దళపతి విజయ్ - త్రిషది హిట్ పెయిర్. ఘిల్లీ, తిరుపాచ్చి, ఆథి, కురువి, లియో సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. దాదాపు 25 ఏళ్ల నుంచి వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఉంది. సహజంగా చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణం, ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు రావడం కామన్. దీనిలో భాగంగానే వీరిద్దరిపైనా ఎన్నో ఏళ్లుగా గాసిప్స్ వస్తున్నాయి. అయితే విజయ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించారో నాటి నుంచి ఈ గాసిప్స్ మరింత ఎక్కువయ్యాయి.

త్రిషతో విజయ్‌కి ముడిపెడుతూ కామెంట్స్
గోవాలో జరిగిన నటి కీర్తి సురేష్ పెళ్లికి త్రిష- విజయ్‌లు ఒకే ఛార్టెర్డ్ ఫ్లైట్‌లో ప్రయాణించడం.. విజయ్ బర్త్ డేకి త్రిష స్పెషల్ విషెస్, లిఫ్ట్‌లో వీరిద్దరి సెల్ఫీ వంటి అంశాలు వైరల్ కావడంతో పాటు రిలేషన్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. రాజకీయాల్లోకి దిగిన నేపథ్యంలో విజయ్‌పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు ప్రత్యర్థులు. టీవీకే అంటే త్రిష, విజయ్, కీర్తి సురేష్ అంటూ పలువురు ఆరోపించారు. అలాగే టీవీకే ద్వారా త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి.
త్రిషతో బంధాన్ని తెంచుకో
ఈ క్రమంలో త్రిష- విజయ్‌ల బంధంపై రెండ్రోజుల క్రితం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి ముందు వ్యక్తిగత, కుటుంబ విషయాలను చక్కదిద్దుకోవాలి. కుటుంబంతో సత్సంబంధాలను కొనసాగించాలి. గొప్ప నేతలు ఉద్యమాలను ఎలా నిర్మించారో తెలుసుకోవాలి. విజయ్‌కి రాజకీయాల్లో ఏం తెలియదు, అతనికి అనుభవం లేదు. అన్నింటికన్నా ముందు అతను త్రిషతో బంధం నుంచి బయటకు వస్తేనే వాస్తవాలు తెలుసుకోగలుగుతాడు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై బీజేపీ - టీవీకే కేడర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్నా త్రిష కానీ, విజయ్ కానీ ఇంత వరకు స్పందించకపోవడం తమిళనాట చర్చనీయాంశమైంది.
నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష రియాక్షన్
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు త్రిష స్పందించారు. ఈ మేరకు తన లాయర్ నిత్యేష్ నటరాజ్ ద్వారా నోట్ విడుదల చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని నా క్లయింట్ అసలు అనుకోలేదు. త్రిష గతంలో కానీ, ప్రస్తుతం కానీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులోనూ రాజకీయాలపై ఎలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాలపై తటస్థంగానే ఉంటూ వస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదు. ప్రజాప్రతినిధులు బాధ్యతగా మెలగాలి. తనను ఓ నటిగానే గుర్తించాలన్నది ఆమె కోరిక. త్రిషకు సంబంధం లేని విషయాల్లో ఆమె పేరును ప్రస్తావించొద్దు అని నటరాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం త్రిష రియాక్షన్.. తమిళ రాజకీయ, సినీ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. దీనిపై నైనార్ నాగేంద్రన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











