Just In
- 19 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 28 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్టార్ హీరోతో త్రిష పెళ్లి.. మ్యారేజ్‌కు ముందు షాకింగ్ నిర్ణయం!
పెళ్లికి ముందు పరిస్థితులన్నింటిని సానుకూలంగా మలుచుకొనేందుకు త్రిష కృష్ణన్ అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోతో పెళ్లికి సిద్దమవుతున్న సమయంలో పాత మెమొరీలన్నింటిని చెడిపేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే పెళ్లికి ముందు తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన గత ఫోటోలన్నింటిని డిలీట్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. త్రిషా తన అకౌంట్‌లో ఫోటోలను ఎందుకు డిలీట్ చేశారంటే..

తమిళ చిత్ర పరిశ్రమలో త్రిష పెళ్లి జోరు
తమిళ చిత్ర పరిశ్రమలో త్రిషా కృష్ణన్ డేటింగ్, ఆఫైర్లు, పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపికే. గతంలో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లిని రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రానాతో పెళ్లి వార్తలు గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. ఇప్పుడు తమిళ హీరో శింబుతో పెళ్లి అంటూ వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియా నుంచి
తాజాగా శింబుతో పెళ్లికి త్రిష సిద్ధమైందనే వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. త్రిష, శింబు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఆమోదం తెలిపారని, త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వెల్లడించే అవకాశం ఉందని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. అయితే పెళ్లికి ముందు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్‌టాగ్రామ్ నుంచి మొత్తానికి మొత్తంగా తొలగించడంపై అనేక అనుమానాలు తలెత్తాయి.

ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టులు ఖాళీ
గత కొన్నేళ్లుగా త్రిష తన ఇన్స్‌టాగ్రామ్‌లో వందల కొద్ది పోస్టులతో అభిమానులను, నెటిజన్లను ఆకర్షించారు. అయితే గత కొద్దకాలంగా ఫోటోలను, పోస్టులను డిలీట్ చూస్తూ వస్తున్నారు.ఇప్పుడు కేవలం ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో కేవలం ఏడంటే ఏడు పోస్టుల మాత్రమే ఉంచారు. దాదాపు వీడియోలన్నింటీని డిలీట్ చేశారు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా.. పాత ఫోటోలను, చెత్త అంతా క్లీన్ చేశాను అంటూ సమాధానమిచ్చినట్టు తెలిసింది.

ఇన్స్‌టాలో ఫాలోవర్స్ రేంజ్
దక్షిణాది నటి త్రిషకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కేవలం ఇన్స్‌టాగ్రామ్‌లోనే 2.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పోస్టు పెడితే వేలు, లక్షల్లో లైక్స్, రీట్వీట్స్ వస్తుంటాయి. అలా అభిమానులు ఆమె అకౌంట్లను నిత్యం ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఆస్వాదిస్తుంటారు. అయితే తన పోస్టులను డిలీట్ చేయడానికి అసలు కారణం.. పెళ్లి తర్వాత కొత్త జాపకాలతో జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

పెళ్లికి ముందు కెరీర్ జోరుగా
త్రిష కృష్ణన్ కెరీర్ విషయానికి వస్తే.. మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే మోహన్‌లాల్ నటిస్తున్న రామ్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే శరవణన్ రూపొందించే రాంగీ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.