సరికొత్త వివాదంలో త్రిషా కృష్ణన్.. పెళ్లి చేసుకొని అంటూ.. సీఎం విజయ్‌పై దారుణంగా ట్రోల్స్
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ జోసెఫ్, దక్షిణాదిలో టాప్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ డేటింగ్, సహజీవనం విషయం ఇప్పటికే మీడియాలోను, సినీ వర్గాల్లోను హాట్ టాపిక్ అవుతున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు వారిద్దరి వ్యవహారం గురించి మీడియా కోడైకూసింది. అయితే తమ బంధం గురించి ఇద్దరు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో ఆ రూమర్లు అలాగే కొనసాగుతున్నాయి.
అయితే తాజాగా విజయ్, త్రిష ఇద్దరు కలిసి తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్‌ను పరామర్శించేందుకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. అయితే సీఎం కాన్వాయ్‌లో త్రిష ప్రయాణించడం తమిళనాడులో సరికొత్త వివాదంగా మారింది. ఈ వ్యవహారంలో త్రిష గురించి నెటిజన్లు దారుణంగా ట్వీట్లు చేస్తూ విజయ్‌ను టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఇంతకు నెటిజన్లు ఏమని త్రిషను ఏకిపారేస్తున్నారు? విజయ్ బాధ్యత వహించాలంటూ చేస్తున్న డిమాండ్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

తమిళనాడు సీఎం కాకముందు విజయ్ ఏం చేసినా ఆయన వ్యక్తిగతం. కానీ ఆయన ఓ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తదుపరి తరానికి త్రిష విషయంలో ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నాడు. అక్రమ సంబంధాలు కొనసాగించవచ్చని చెబుతున్నాడా? చట్టబద్దంగా విడాకులు తీసుకొని.. ఆ తర్వాత త్రిషను పెళ్లి చేసుకొని తన వెంట తిప్పుకోవచ్చు అని నెటిజన్ అభిప్రాయపడ్డారు.
మాతృ వియోగంతో బాధపడుతున్న అజిత్‌ను పరామర్శించడానికి విజయ్ కాన్వాయ్‌లో త్రిష వచ్చింది. సీఎం కాన్వాయ్‌లో రావడానికి ఆమె ఎవరు? ప్రభుత్వ కాన్వాయ్‌ని ఉపయోగించుకోవడానికి ఆమెకు ఉన్న అర్హత ఏమిటి? ప్రభుత్వ అధికారాలను ఉపయోగించుకోవడానికి తమిళనాడు ప్రజలు ఆమెకు ఓటు వేయలేదు అని మరో నెటిజన్ ఘాటుగా స్పందించారు.
అజిత్ తల్లికి శ్రద్దాంజలి ఘటించేందుకు వచ్చిన విజయ్‌తో త్రిష కూడా కనిపించింది. వివాహితుడుగా ఉండే వ్యక్తి మరో వ్యక్తితో పబ్లిక్ తిరగడం ఖండించదగినది. బాధ్యాతారహితమైంది. అగౌరవప్రదం కూడా. ముందు అధికారికంగా చట్టబద్దంగా విడాకులు తీసుకొని ఇలాంటి తిరిగితే ఎవరూ తప్పు పట్టరు అంటూ కామెంట్ చేస్తున్నారు.
అజిత్ తల్లికి శ్రద్దాంజలి ఘటించేందుకు ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి త్రిష వెళ్లడం వివాదంగా మారింది. ఆమె చేసిన పనిని అందరూ వేలెత్తి చూపుతున్నారు. కానీ అలా తప్పుపట్టడం సరికాదు. వాళ్లంతా తమిళ సినీ రంగానికి చెందిన వారు. ఇలాంటి విషాద సమయంలో సపోర్టుగా ఉండాలి. కానీ ఇలా ప్రశ్నించకూడదు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే త్రిష, విజయ్ తాజా వ్యవహారం సోషల్ మీడియాలో భారీగా చర్చకు దారి తీసింది. బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగే వారు నైతిక విలువలను పాటించాలి. సభ్య సమాజానికి జవాబుదారీగా ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజా వివాదంపై త్రిష, విజయ్ మౌనంగా ఉన్నప్పటికీ.. తమ బంధంపై ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications