విజయ్‌తో అఫైర్ రూమర్లు.. అలాంటి ఫోటో షేర్ చేసిన త్రిష.. ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్

తమిళ సినిమా పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్‌గా మారిన విషయం విజయ్, త్రిష అఫైర్. వారిద్దరి డేటింగ్ చేస్తున్నారనే విషయం జాతీయ మీడియాలోను హాట్ టాపిక్‌గా మారింది. దాంతో వారిద్దరి రిలేషన్‌షిప్‌పై రకరకాల కథనాలు మీడియాలో కనిపించాయి. దానికి తగినట్టే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా రూమర్లకు బలపడేలా చేసింది. వారిద్దరి మధ్య బంధం గురించిన వివరాల్లోకి వెళితే..

విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయనతో వెకేషన్‌కు వెళ్లిన త్రిషా.. సెల్ఫీ వీడియోను పోస్టు చేసింది. దాంతో వారిద్దరి డేటింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. దాంతో వారిద్దరి అఫైర్ గురించి కథలు, కథలుగా బయటకు వచ్చాయి. అయితే అటు విజయ్ కానీ, లేదా త్రిషా గానీ పెద్దగా పట్టించుకోలేదు. ఎవరు ఏమనుకొన్నా తమ పని తాము చేసుకొంటూ వెళ్లారు.

Trisha Krishnan Shares Vijay s The Goat s Song photos in Instagram goes Viral

ఇక విజయ్, త్రిష మధ్య కెమిస్ట్రీ దృష్టిలో పెట్టుకొని తాజా చిత్రంలో వెంకట్ ప్రభు ఓ స్పెషల్ సాంగ్ డిజైన్ చేశారు. అయితే ఆ విషయాన్ని చాలా సీక్రెట్‌గా పెట్టి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ది గోట్ సినిమాలో వారిద్దరితో షూట్ చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట మూవీకి హైలెట్‌గా మారింది. ఆ పాట తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో స్పష్టమైంది.

అయితే విజయ్‌తో చేసిన పాటలో త్రిషా వేసుకొన్న దుస్తులు, వేసిన స్టెప్పులన్నీ శ్రీలీలతో పొల్చడం తెలిసిందే. ఆ పాటకు భారీగా వ్యూస్ మాత్రమే కాకుండా.. ఈ వయసులో ఆమెలో ఇంత జోష్ ఉందా? అనే కామెంట్స్ నెటిజన్ల నుంచి వచ్చాయి. ఈ తరం హీరోయిన్లకు త్రిషా మంచి పోటీ ఇస్తున్నదనే కామెంట్స్ ఆ పాటను చూసిన తర్వాత వినిపించాయి.

Trisha Krishnan Shares Vijay s The Goat s Song photos in Instagram goes Viral

అయితే ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న సమయంలో త్రిషా తన ఇన్స్‌టాగ్రామ్‌లో విజయ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ది గోట్ సినిమాలోని పాటలో ఉన్న స్టిల్స్‌ను అభిమానులతో పంచుకొన్నది. ఆ ఫోటోలో ఇద్దరు ఒకరి ముఖంలో మరొకరు చూసుకొంటూ ప్రేమను ఒలకబోసుకొంటున్నారు. అది చూసిన ఇద్దరి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ ఫోటోను షేర్ చేశారనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు.

త్రిషా షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. విజయ్ నటించే దళపతి69 మూవీలో కూడా త్రిషా హీరోయిన్‌గా నటిస్తే చూడాలని ఉంది అంటూ నెటిజన్ కామెంట్ చేశారు. పసుపు పచ్చ చీరలో అందంగా ఉన్నారు. రూమర్లు ఎన్ని వచ్చినా పట్టించుకోకుండా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ప్రేమ పెరిగిపోతున్నది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: trisha krishnan vijay the goat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X