త్రిషపై మళ్ళీ అదే రూమర్
త్రిషకి వివాహ ఘడియలు దగ్గరపడ్డాయని ఓ లీడింగ్ ఇంగ్లీష్ దినపత్రిక వార్త ప్రచురించింది. అంతేగాక ఆ న్యూస్ ని ఆమెకు బాగా పరిచయమున్న పేరు వెళ్ళడించటానకి ఇష్టపడని సన్నిహితురాలైన ఓ నటి చెప్పినట్లు ఇంగ్లీష్ దిన పత్రిక ప్రకటించింది. త్రిష కుటుంబం ఇప్పటికే పెళ్ళి కొడుకు వేట పూర్తి చేసి ఫైనలేజషన్ లో ఉన్నారని తెలిపింది.అయితే ఇంతకుముందు కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయిని, అయితే ఇది ఖచ్చితమైన సమాచారమని రాసుకొచ్చింది. ఇక త్రిష చేతిలో కూడా వెంకటేష్ తో చేస్తున్న బాడీగార్డు చిత్రం తప్ప మరేమీ లేకపోవటం కూడా పెళ్లిని ఓకే చేసేందుకు కారణమైందని రీజన్ చెప్పుకొచ్చింది. అయితే త్రిష వద్ద ఈ మ్యాటర్ ప్రస్దావిస్తే ఎప్పటిలాగే కొట్టిపారేసింది. తనకు టైమ్ వచ్చి పెళ్లి చేసుకునేటప్పుడు గ్యారెంటీగా అందరినీ పిలిచి చెప్పే చేసుకుంటానని చెప్పింది. అలాగే తవప సరిజోడి అనుకున్న వ్యక్తి దొరికినప్పుడు గ్యారెంటీగా ప్రపంచానికి తెలియచేస్తానని అంది.ఇంతకీ ఏది నిజం..ఏది అబద్దం అనేది కాలమే తేల్చాలి.


Click it and Unblock the Notifications











