Trisha Krishnan: సినిమా ఇండస్ట్రీకి త్రిష గుడ్‌బై.. ఆ హీరో అడుగులో అడుగేస్తున్న బ్యూటీ!

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ గురించిన వార్తలు ఇటీవల కాలంలో మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు ఆమె పెళ్లి వార్తలు జోరందుకోగా, ప్రస్తుతం అవి సద్దుమణిగి ఇప్పుడు కొత్తగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. విజయ్ నటించిన ది గోట్ మూవీ తర్వాత ఈ వార్తలు మరింత ఊపందుకొన్నాయి. అయితే త్రిషా గురించి తమిళ, మలయాళ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల వివరాల్లోకి వెళితే..

తమిళ ఇళయ దళపతి విజయ్‌తో కలిసి లియో, ది గోట్ సినిమాలో త్రిషా కృష్ణన్ నటించింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య అఫైర్, డేటింగ్ కొనసాగుతుందనే విషయం నేషనల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వారిద్దరూ మాత్రం ఏ మాత్రం తొందరపడకుండా వాటిపై స్పందించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి బిజీగా మారిపోతే.. త్రిష చుట్టు ఆ అంశం తిరుగుతున్నది.

Trisha Krishnan s retirement from films and Political entry in Tamilnadu Tamil film critic Anthanan made sensational comments goes Viral

అయితే విజయ్, త్రిషా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నారు అనే వార్తలు తమిళ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ గాలి వార్తలే అనేది మీడియాలోనే మరో వర్గం కామెంట్స్ చేస్తున్నది. ఈ క్రమంలో త్రిష గురించి తమిళ క్రిటిక్ అంతనన్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. అంతేకాకుండా త్రిష భవిష్యత్ ప్రణాళిక సెన్సేషనల్‌గా మారింది.

అయితే ఇటీవల క్రిటిక్ అంతనన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రిషా కృష్ణన్ త్వరలోనే నటనకు గుడ్ బై చెప్పబోతున్నారు. ఆమె యాక్టింగ్‌కు దూరమై రాజకీయాల్లో ప్రవేశించనున్నారు. ఆమె విజయ్‌తోపాటు పాలిటిక్స్‌లో బిజీగా మారే అవకాశం ఉంది. తన భవిష్యత్ కార్యాచరణపై తన తల్లితో చర్చిస్తున్నారు అని తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దక్షిణాది మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Trisha Krishnan s retirement from films and Political entry in Tamilnadu Tamil film critic Anthanan made sensational comments goes Viral

త్రిషా కృష్ణన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల టొవినో థామస్‌తో కలిసి ఐడెంటిటీ సినిమాలో నటించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా అడుగులేస్తున్నది. ఇక అజిత్‌తో కలిసి విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవితో కలిసి విశ్వంభర, మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్‌తో కలిసి థగ్ లైఫ్, సూర్యతో కలిసి ఆయన నటించే 45వ సినిమాలోను, అలాగే రామ్ అనే చిత్రంలో నటిస్తూ 2025 సంవత్సరంలో బిజీగా ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె యాక్టింగ్‌కు గుడ్ బై చెబుతున్నారనే వార్త సినీ వర్గాలను, అభిమానులను షాక్‌కు గురిచేస్తుంది. ఇంత బిజీగా ఉన్న ఆమె సినిమా ఇండస్ట్రీని వదిలిపోవొద్దని అభిమానులు కోరుకొంటున్నారు. అయితే ఈ వార్త నిజమేనా? ఇందులో వాస్తవం ఎంత? అని చర్చించుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X