నా పేరుకీ, కెరీర్ కి లింకేమిటంటే...త్రిష
త్రిష అంటే 'విజయం' అని అర్థం. అందుకే విజయం ఎప్పుడూ నా వెన్నంటే ఉంటుంది అంటోంది త్రిష. వరసగా కెరీర్ లో విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న త్రిష ప్రస్తుతం ఆమె చిరకాల స్వప్నం అయిన కమల్ హాసన్ సరసన చేస్తోంది. మాధవన్ మరో పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ విషయాలు చెప్తూ పనిలో పనిగా తన గురించి కొంచెం గొప్పలు చెప్పుంది. ఇక కమల్ సినిమా గురించి చెప్తూ...కమల్ హాసన్ సరసన 'మన్మధన్‌అంబు' సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. త్వరలో ఈ చిత్రం కోసం 45 రోజుల పాటు నదిలో చిత్రీకరించనున్నారు. కమల్ సార్, మాధవన్, నేను ఆ షూటింగ్‌లో పాల్గొననున్నాం. అంటే పడవలోనే ఎక్కువ శాతం షూటింగ్ ఉంటుంది. ముందే చెప్పాగా...నా పేరులోనే విజయం ఉంది. విజయవంతంగా నీటిలో షూటింగ్ చేసి విజయం సాధిస్తా' అంటోంది. ఇక ఈ చిత్రంతో పాటు ఆమె తన గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా మీటా చిత్రంలో అక్షయ్ కుమార్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











