పునరుత్తేజం కోసమే..త్రిష
కాసింత సమయం దొరికినా చాలు..పునరుత్తేజం కోసం ప్రయత్నిస్తాను. అలాగే నా సంతోషం ఎక్కడుందో నాకు స్పష్టంగా తెలుసు. అందుకోసం సమయాన్ని కేటాయిస్తాను..అంటోంది త్రిష. ఇంతకీ తను పునరుత్తేజం కోసం ఏం చేస్తోందో మాత్రం చెప్పటం లేదు..అయితే కుక్కపిల్లలతో అప్పడప్పుడూ ఆడుతూంటే మనస్సాంతిగా ఉంటుందని చెప్పింది. అలాగే పనిలేనప్పుడు పొరపాటున కూడా ఇంట్లో కూర్చోవటం ఇష్టం లేదని తెగేసి చెప్తోంది. ఆ విషయంపై మీడియాతో మాట్లాడుతూ..ఆడపిల్లంటే అలా ఉండాలి..ఇలా ఉండాలి. అని వీలైన ప్రతిచోటా క్లాసులు తీసుకుంటుంటారు.
థాంక్ గాడ్. నేను లక్కీ. అమ్మ నాకెప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. పార్టీలు, పబ్ లు, ఫ్రెండ్స్.. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు జీవితాన్ని ఆనందంగా గడపాలి? అంటూ ఎదరు ప్రశ్నిస్తోంది. మంచి నిర్ణయమే..అయినా సంపాదించి పెట్టే వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఏం కంట్రోలు చేయగలరు..పార్టీలకు వెళ్ళదంటే ఆగుతావా, మీ సంగతి చెన్నైలో ఏ పబ్ వాళ్ళని అడిగినా చెప్తారు..అంతగా కాకపోతే నీ ప్రెండ్స్ విశాల్, నయనతార, శ్రియ లను అడిగినా విప్పి చెప్తారు..ఫొటోలతో సహా అంటున్నారు. ఎందుకంటే రెండు నెలల క్రిందట త్రిష పబ్ లో త్రాగుతూ ఊగుతున్న ఫొటోలను నెట్లో లీక్ చేసింది..వాళ్ళేనని అందరి అనుమానం.


Click it and Unblock the Notifications











