'తీన్ మార్' హిట్టుతో మరో మూడు రీమేక్ లు కమిటైన త్రిష
త్రిష నటించిన తీన్ మార్(హిందీ రీమేక్) చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవటంతో త్రిషకు వరసగా రీమేక్ ఆఫర్స్ వస్తున్నాయి.రీసెంట్ గా ఆమె వెంకటేష్ సరసన బాడీగార్డ్ రీమేక్ కమిటైంది. ఆ చిత్రం షూటింగ్ జరుగుతూండగనే మరో రెండు రీమేక్ లలో ఆమెను ఎన్నుకున్నారు. హిందీలో హిట్టయిన 'బ్యాండ్ బాజా బారత్' సినిమాను యుటివి మూవీస్ వారు తెలుగు, తమిళ బాషలలో నిర్మించనున్నారు. ఆ చిత్రంలో అనుష్క శర్మ పోషించిన పాత్రలో నటించడానికి త్రిషను ఎంపిక చేసుకున్నారు. అలాగే రెండు బాషలకు అనువుగా ఉండే హీరో కోసం నిర్మాణ సంస్థ ప్రత్నిస్తుందని సమాచారం. అయితే రవితేజ ఈ పాత్రను పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.
'తను వెడ్స్ మను'బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'తను వెడ్స్ మను' ఇప్పుడు తమిళంలో పునర్నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కంగనారనౌత్ పాత్రలో త్రిష అయితే బాగుంటుందని మాధవన్ భావిస్తున్నారు. త్రిష కూడాఈ ప్రాజెక్టుకు సరే అంది.గతంలో వీరిద్దరూ 'మన్మథబాణం' సినిమాలో కలిసి నటించారు. మాధవన్‌తో నటించడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మంచి నటుడు. సున్నిత స్వభావం తనది. అన్నీ కుదిరితే 'తను వెడ్స్ మను'లో మరోసారి కలిసి నటిస్తాం అని చెప్పేసింది. జూన్‌లో ఈ రీమేక్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











