పారిశ్రామికవేత్త తో స్టార్ హీరోయిన్ త్రిష వివాహం
త్రిషకు త్వరలో వివాహం జరగనుందని, ఓ పారిశ్రామికవేత్తని ఓకే చేసిందని,కుటుంబసభ్యుల సమక్షంలో ఇందుకు సంభందించిన ఫార్మాలిటీస్ జరిగాయని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్ళూ తాను పెళ్ళి చేసుకోబోయేవాడు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పిన త్రిష హఠాత్తుగా ఈ నిర్ణయానికి దారితీసిన అంశాలు ఏమిటన్నది తెలియటం లేదంటున్నారు. ప్రస్తుతం తమిళంలో అజిత్ సరసన 'మాంగాత', తెలుగులో పవన్ కళ్యాణ్‌తో 'తీన్ మార్' చిత్రాల్లో త్రిష నటిస్తోంది.
ఈ రెండు చిత్రాలు పూర్తయిన తరువాత పెళ్లి చేయాలని త్రిష తల్లిదండ్రులు నిర్ణయించినట్లు తెలిసింది. వివాహానంతరం నటనకు గుడ్‌బై చెబుతుందా లేక , కంటిన్యూ చేస్తుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి అంటూ రాస్తున్నారు. అయితే ఇది రూమరా లేక నిజమా అన్నది మాత్రం తెలియాలి. ఎందుకంటే తెలుగులో వెంకటేష్ సరసన ఆమె రీసెంట్ గా సావిత్రి చిత్రం ఓకే చేసిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











