అమృత్ తో త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతుందా..!?

By Sindhu

చెన్నైకి చెందిన అమృత్ అనే పారిశ్రామిక వేత్తను ప్రేమిస్తోంది అయితే త్వరలోనే అంటే సెప్టెంబర్ నెలలో నిశ్చితార్ధం కూడా అని తమిళ్ సినిమా వర్గాల్లో ఒకటే చర్చ అన్న ప్రచారం మొదలయింది, దీనితో త్రిష తల్లి ఉమాక్రిష్ణన్ మాత్రం ఇవ్వన్ని కట్టు కథలు వీటిని ఎవరు నమ్మవద్దు అని చెప్పారు. ఆమె మీడియా తో మాట్లాడుతూ త్రిష మనసులో ఏముందో ఇంతవరకు మాకే తెలియదు, అయితే ఒక్కటి మాత్రం నిజం త్రిషకు ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఉద్దేశం మాత్రం లేదని ఖరా ఖండిగా తేల్చి చెప్పారు.

ఇప్పటికైతే త్రిష తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ గా వుంది, అయినా ఒకవేళ త్రిష పెళ్లి గురించి అయితే ముందుగా మేమే మీడియాలో చెప్పేవాళ్ళం కదా. కాబట్టి ఇటువంటి గాలి వార్తలను నమ్మవద్దు అని తెలిపారు. అయినా త్రిష సినిమాలలో సంపాధించాల్సింది చాలా వుంది కాబట్టి ఇంకా త్రిష పెళ్లి విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తీసుకుంటే గనుక అది రహస్యంగా ఉండదని తెలిపారు. ఒక్కటి మాత్రం నిజం ఈ విషయమై త్రిష తల్లి మీడియా ముందు చెప్పారు గాని, త్రిష మాత్రం ఎటువంటి సమాధానం చెప్పలేదంటే తన మనసులో ఏముందో ఎవరికీ తెలుసునని సినిమా వర్గాలు కోడై కూస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన ఓ సినిమా, తమిళంలో అజిత్ సరసన ఓ సినిమా చేస్తున్నది. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నవన్నీ రేపు చేయబోతున్నవీ అన్నీ పెద్ద సినిమాలే. కెరీర్ ఇంత స్పీడ్ లో ఉంటే పెళ్లిగురించి ఆలోచించమంటారా అంటోంది త్రిష.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X