ఆ స్టార్ హీరోయిన్ వస్తుందా? .. టెన్షన్‌లో నిర్మాత

హీరోలు ఓ రకంగా తమ ఉనికి చాటుకుంటూ ఉంటే.. హీరోయిన్లు మరో రకంగా తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఒక్కో నటి ఒక్కో రకంగా టెన్షన్‌ పెడుతూ ఉంటుంది. కొందరు షూటింగ్‌కు సరిగా రాక దర్శక, నిర్మాతలను ఒత్తిడికి గురి చేస్తుంటే, మరొకరు పూర్తి పారితోషం చెల్లిస్తేనే చిత్రాన్ని పూర్తిచేస్తానని కండీషన్లు పెట్టి టెన్షన్‌కు గురిచేస్తారు.

ఇక సంచలన నటి నయనతార అయితే చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్‌కు రాకుండా దర్శక నిర్మాతలకు టెన్షన్‌ తెప్పిస్తుంది. ఇప్పుడు నటి త్రిష కూడా తాను నటించిన చిత్ర నిర్మాతను టెన్షన్‌కు గురిచేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే నయనతార తీరు వేరు, త్రిష తీరు వేరుగా ఉంది.

Trisha May Come Or Not To Paramapadham Vilayattu Promotions

ఇప్పుడు నటి త్రిష చాలా బిజీ అన్నది తెలిసిందే. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటించిన చిత్రాల్లో ఒకటి పరమపదం విళైయాట్టు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టిన యూనిట్‌కు త్రిష వస్తుందా? రాదా? అన్న టెన్షన్ పట్టుకుందట. మణిరత్నం సినిమా షూట్ ఉండటంతో రాలేకపోవచ్చని తెలుస్తున్నా.. తాను కచ్చితంగా వస్తానని మాటిచ్చిందటా త్రిష. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కాగా ఈ అమ్మడు హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటించిన చిత్రాల్లో ఒకటి పరమపదం విళైయాట్టు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దీంతో చిత్ర వర్గాలు ప్రమోషన్‌లో భాగంగా మీడియా సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు ఒక తేదీని ఫిక్స్‌ చేసుకున్నారు. అందులో పాల్గొనాల్సిందిగా నటి త్రిషకు ఆహ్వానం పంపారు. అందుకు తనూ ఓకే చెప్పిందట. అయితే ఈ అమ్మడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే

ఇందులో మహారాణిగా నటించనున్నట్లు తెలిసింది. కాగా పరమపదం విళైయాట్టు చిత్ర మీడియా సమావేశం రోజునే దర్శకుడు మణిరత్నం తన చిత్రంలోని త్రిష గెటప్‌ కోసం ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేశారట. దీంతో అందులో పాల్గొననున్న త్రిష తన చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంటుందా అన్న టెన్షన్‌ పరమపదం విళైయాట్టు చిత్ర నిర్మాతకు పట్టుకుందట. అయితే త్రిష మాత్రం తాను కచ్చితంగా మీడియా సమావేశంలో పాల్గొంటానని, సమావేశాన్ని రద్దు చేయవద్దని ఆ నిర్మాతకు మాట ఇచ్చిందట. అయినా ఆమె డుమ్మా కొడుతుందేమోనన్న టెన్సన్‌లోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే అక్కడ ఫొటో షూట్‌ జరగనుంది మణిరత్నం చిత్రానికి, అదీ రాణి గెటప్‌కు. అక్కడ గనుక ఏ మాత్రం ఆలస్యం అయినా త్రిష పరమపదం విళైయాట్టు చిత్ర ప్రమోషన్‌కు డుమ్మా కొట్టే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X