త్రిష తల్లిని సైతం కమల్ హాసన్ వదిలిపెట్టకుండా...
ఒక్కసారి రంగువేసుకుని తెరపై కనపడితే ఆ పిచ్చి జీవితాంతం పోదు అంటూంటారు సీనియర్లు. అది గమనించో ఏమో త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఎంతోమంది దక్షిణాది దర్శకులు తమ చిత్రాల్లో నటించమని అడిగినా చేయమని ఒప్పుకోలేదు. అయితే కమల్ హాసన్ చొరవ తీసుకుని తన చిత్రం మన్మధన్ అంబులో నటించమని అడిగి ఒప్పించాడుట. ఆమె కూడా కమల్ వంటి గొప్ప నటుడు అడిగిన తర్వాత ఇక బాగోదమనుకుందో ఏమో కానీ ఓకే అని కమిట్ అయిపోయింది. ఈ చిత్రంలో ఆమెది కీరోల్ అని చెప్తున్నారు. కామిడీతో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్సకత్వంలో రూపొందుతోంది. ఇంతకుముందు దశావతారం, తెనాలి, పంచతంత్ర వంటి చిత్రాలకు కమల్, రవి కుమార్ కలిసి పనిచేసారు.
త్రిష కమల్ హాసన్ పంచతంత్ర మన్మధన్ అంబు దశావతారం trisha kamal hassan panchatantra manmadhan ambu dasavataram


Click it and Unblock the Notifications