త్రిష లవ్ ఎఫైర్ ఆమె తల్లికి తెలుసు
త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తమిళ సినిమా వర్గాల్లో ప్రచారం గత కొద్దిరోజులుగా వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారు మరిన్ని వివరాలు ఇస్తున్నారు. చెన్నైకి చెందిన అమృత్ అనే యువ పారిశ్రామికవేత్తను త్రిష ప్రేమిస్తోందని, సెప్టెంబరులో నిశ్చితార్థం అని చెబుతున్నారు. అయితే ఈ వార్తల్ని ఎప్పటిలాగే త్రిష తల్లి ఉమాకృష్ణన్ ఖండించారు. అయితే ప్రేమ విషయాన్ని ఖండించక పోవటం అందరిలో ఆసక్తిని రేపుతోంది.ఆమె మాటల్లోనే...'త్రిష మనసులో ఏముందో తెలియదు. అయితే మా అమ్మాయికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంద్.అంటే త్రిష తల్లికి ఈ ప్రేమ వ్యవహారం తెలుసు కాబట్టే ఖండించటం లేదని అంటున్నారు.తన కూతురు మనస్సులో ఏముందో తెలియదని తెలివిగా చెప్తోందని చెప్తున్నారు.
ఇన్నాళ్ళూ తాను పెళ్ళి చేసుకోబోయేవాడు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పిన త్రిష హఠాత్తుగా ఈ నిర్ణయానికి దారితీసిన అంశాలు ఏమిటన్నది తెలియటం లేదంటున్నారు. ప్రస్తుతం తమిళంలో అజిత్ సరసన 'మాంగాత', తెలుగులో వెంకటేష్ తో 'బాడి గార్డు' చిత్రాల్లో త్రిష నటిస్తోంది.ఈ రెండు చిత్రాలు పూర్తయిన తరువాత పెళ్లి చేయాలని త్రిష తల్లిదండ్రులు నిర్ణయించినట్లు తెలిసింది. వివాహానంతరం నటనకు గుడ్‌బై చెబుతుందా లేక , కంటిన్యూ చేస్తుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి అంటూ రాస్తున్నారు.


Click it and Unblock the Notifications











