త్రిషా,నయనతార ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఈ క్రేజి ఆలోచనకు ఓ రూపం ఇస్తూ ఓ సినిమా రూపొందనుందిట. అదిరిపోయే ఈ అందగత్తెలిద్దరూ తమిళ సెన్సేషన్ విక్రమ్ కి చెరో ప్రక్కన కనిపించనున్నారట. అసలు వీళ్లిద్దరి మధ్య మొదటి నుంచీ పోటీ రసవత్తరంగా నడుస్తోంది. తెలుగు,తమిళ ప్రేక్షకులను తన అందం, అభినయాలతో కట్టి పడేసి హవా కొనసాగిస్తున్న బ్యూటీ త్రిష. ఇక చంద్రముఖితో ఒక్క సారిగా తెరమీదకు వచ్చి సెటిలైన తార నయనతార. వస్తూనే త్రిషకు గట్టి పోటీ ఇచ్చింది.'దుబాయ్ శ్రీను'తో దుమ్ము రేపింది. ఆమె తమిళంలో అజిత్ తో చేసిన 'భిల్లా 'సినిమా రికార్డులు సృష్టించింది. అందులో బికినీలో కనపడి వసూళ్ల వర్షం కురవటానికి కారణం అయింది. ఇక త్రిష తాజాగా రవితేజతో చేసిన 'కృష్ణ' సూపర్ హిట్ కావడంతో తన స్థానాన్ని తిరిగి స్థిరపరుచుకుంది. నయనతారలా బికినీల్లో కనిపించనంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమాలో ఈ ఇద్దరూ కనిపించి కనువిందు చేయబోతున్నారు. అభిమానులుకు పసందు కదా