గాయపడ్డ కుక్కకు త్రిష చికిత్స చేయించిందని....
ఇటీవల సినిమా షూటింగ్ లో గాయపడ్డ కుక్కకు త్రిష చికిత్స చేయించి పెంచుకుంటున్నట్టు తెలుసుకున్న పెటా నిర్వాహకులు ఆమెను సంప్రదించగా ప్రచారానికి ఆమె అంగీకరించినట్టు సమాచారం. దాంతో త్రిష జంతు సంరక్షణ సంస్థ 'పెటా'కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పెటాతో త్రిష ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెన్నై సినీ వర్గాలు తెలిపాయి. 'ఏంజెల్ ఆఫ్ యానిమల్స్' కార్యక్రమానికి ఆమె ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష..ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా మీటా అనే చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే కమల్ హాసన్ సరసన 'దశావతారం' దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరక్షన్ లో ఓ చిత్రం చేస్తోంది. ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారవుతోంది. ఇక ఈ చిత్రంలో త్రిష కమల్ హాసన్, మాధవన్ ల మధ్యన నలిగిపోతూ నవ్వించే పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











